సౌదీ ప్రొఫెషనల్ అక్రిడిటేషన్ ప్రోగ్రామ్.. 209,500 మంది ప్రవాస కార్మికులకు గుర్తింపు..!!

- October 21, 2024 , by Maagulf
సౌదీ ప్రొఫెషనల్ అక్రిడిటేషన్ ప్రోగ్రామ్.. 209,500 మంది ప్రవాస కార్మికులకు గుర్తింపు..!!

రియాద్: మానవ వనరులు,  సామాజిక అభివృద్ధి మంత్రిత్వ శాఖ ప్రారంభించిన సౌదీ ప్రొఫెషనల్ అక్రిడిటేషన్ ప్రోగ్రామ్ కింద ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా 1,000 వృత్తులలో 209,500 కంటే ఎక్కువ మంది కార్మికులకు గుర్తింపు మంజూరు చేశారు. కార్మిక మార్కెట్ అవుట్‌పుట్‌ నాణ్యతను మెరుగుపరచడానికి మంత్రిత్వ శాఖ నిరంతర ప్రయత్నాలలో భాగమైన ఈ కార్యక్రమం.. ప్రవాస కార్మికుడిలో అవసరమైన నైపుణ్యాలు, అర్హతలను కలిగి ఉండేలా చూస్తుంది.  ప్రోగ్రామ్‌లో "ప్రొఫెషనల్ వెరిఫికేషన్", "ప్రొఫెషనల్ ఇన్‌స్పెక్షన్" సేవలు ఉన్నాయి.  ఈ "ప్రొఫెషనల్ వెరిఫికేషన్" సేవ ప్రవాస కార్మికుల నైపుణ్యాలు, అనుభవాలు, ధృవపత్రాలను ధృవీకరించడం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ప్రక్రియ పూర్తిగా ఆటోమేటెడ్. గరిష్టంగా 15 పని దినాల ప్రాసెసింగ్ సమయంతో యూనిఫైడ్ ఎలక్ట్రానిక్ ప్లాట్‌ఫారమ్ ద్వారా నిర్ధారిస్తారు. ప్రపంచవ్యాప్తంగా 127 కంటే ఎక్కువ ప్రొఫెషనల్ పరీక్షా కేంద్రాల ద్వారా ఈ ప్రోగ్రామ్ కొనసాగుతుంది.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com