విశ్వక్ సేన్ కి అంత కాన్ఫిడెన్స్ ఏంటో.!

- October 21, 2024 , by Maagulf
విశ్వక్ సేన్ కి అంత కాన్ఫిడెన్స్ ఏంటో.!

విలక్షణ నటుడు విశ్వక్ సేన్ ఏం చేసినా అదో సెన్సేషనే. తాజాగా ఆయన నటిస్తున్న సినిమాకి సంబంధించి ప్రమోషన్లు చిత్రంగా అనిపిస్తున్నాయ్.

కాన్ఫిడెన్స్ వుండొచ్చు. కానీ, ఓవర్ కాన్ఫిడెన్స్ అయితేనే కాస్త ఇబ్బంది. ఆల్రెడీ ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ రూపంలో విశ్వక్ సేన్ ఖాతాలో ఓ ఫెయిల్యూర్ వుంది.

ఇప్పుడు ‘మెకానిక్ రాఖీ’ అనే సినిమాతో వస్తున్నాడు. ఈ సినిమా రేపే అనగా అక్టోబర్ 22న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. లేటెస్ట్‌గా జరిగిన ట్రైలర్ రిలీజ్ ఈవెంట్‌లో విశ్వక్ సేన్ మాటలు విస్తుపోయేలా చేశాయ్.

సినిమాపై బజ్ లేదన్నారు. ఇక నుంచి చూడండి ఏ రేంజ్‌‌లో బజ్ వుంటందో అని చెప్పడం ఆయన కాన్ఫిడెన్స్‌కి ప్రతిరూపం. అలాగే, పెయిడ్ ప్రీమియర్లు చూసి సినిమాకి ఏ స్థాయిలో బజ్ వస్తుందో మీరే చూస్తారు.

ఒకవేళ సినిమా బాగాలేదనిపిస్తే.. ఒరిజినల్ రిలీజ్‌కి ధియేటర్లకి జనాలు రావల్సిన పనే లేదు.. అంటూ రకరకాలుగా కామెంట్లు చేసుకున్నాడు తన సినిమా గురించి. గతంలో పలు మార్లు తన సినిమాపై ప్రాంక్ వీడియోలు చేస్తూ.. చిత్రమైన ప్రమోషన్లు చేసేశాడు. కొన్ని వికటించి రచ్చగా మారిన పరిస్థితులు కూడా చూశాం.

ఈసారి ‘మెకానిక్ రాఖీ’ విషయంలో మనోడి ఓవర్ కాన్ఫిడెన్స్ చూస్తుంటే ఎలా అర్ధం చేసుకోవాలో తెలియడం లేదు. మీనాక్షి చౌదరి, శ్రద్ధా శ్రీనాధ్ ఈ సినిమాలో విశ్వక్ సేన్‌తో జోడీ కడుతున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com