బిగ్ వార్నింగ్.! బాడీ షేమింగ్ చేస్తున్నావా.?

- October 22, 2024 , by Maagulf
బిగ్ వార్నింగ్.! బాడీ షేమింగ్ చేస్తున్నావా.?

బిగ్‌బాస్ హౌస్‌లో నామినేషన్ల పర్వం ఎప్పుడూ ఇంట్రెస్టింగ్‌గానే వుంటుంది. ఒకరి మీద ఒకరు అనవసరమైన రీజన్స్ చెప్పుకుంటూ నామినేట్ చేసుకునే విధానం ఒక్కోసారి హద్దులు దాటేస్తుంటుంది.

అఫ్‌కోర్స్.! ఎంతలా హద్దులు దాటితే అంతలా జనానికి ఎంటర్‌టైన్‌మెంట్ అన్న మాట. బిగ్ బాస్ ప్రోగ్రామ్‌నే అలా డిజైన్ చేశారు మరి. ఇక ఈ సీజన్‌లోనూ నామినేషన్లు ఘాటు ఘాటుగా జరుగుతున్నసంగతి తెలిసిందే.

తాజా నామినేషన్ల ఎపిసోడ్‌లో రోహిణికీ, పృధ్వీకీ మధ్య జరిగిన మాటల యుద్ధం ఒకింత హద్దులు దాటింది. ఆ మాటకొస్తే.. ఏ నామినేషన్‌లో అయినా సరే, పృద్వీ అన్‌లిమిటెడ్ ఆటిట్యూడ్‌తో రెచ్చిపోతున్న సంగతి తెలిసిందే.

ఎవరిని తాను నామినేట్ చేయాలన్నా.. లేదా ఎవరైనా తనను నామినేట్ చేస్తున్నా.. అతను చూపిస్తున్న ఆటిట్యూడ్ అంతా ఇంతా కాదు.

అలా పృద్వీని నామినేట్ చేయబోయిన రోహిణికి తాజాగా చేదు అనుభవం ఎదురైంది. తన ఆటిట్యూడ్, అగ్రెసివ్‌నెస్‌లో భాగంగా పృద్వీ చూసిన చూపులు రోహిణిని నొప్పించాయ్.

తన పర్సనాలిటీని చిన్న చూపు చూస్తున్నాడనీ, బాడీ షేమింగ్ చేస్తున్నాడనీ ఆరోపించింది. తన పర్సనాలిటీ అలా వున్నప్పటికీ టాస్కుల్లో తాను యాక్టివ్‌గానే వుంటున్నా.. కానీ, కండలు తిరిగిన బాడీ వేసుకుని కూడా నువ్వేం పీకట్లేదు.. అన్నట్లుగా రోహిణి, పృద్వీని తగులుకుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com