ప్రబాస్ కల్కి కన్నా ముందే ‘శంబాల’ చూపించేస్తారట.!

- October 22, 2024 , by Maagulf
ప్రబాస్ కల్కి కన్నా ముందే ‘శంబాల’ చూపించేస్తారట.!

ఇటీవల ప్రబాస్ నటించిన ‘కల్కి’ సినిమా సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో కాశీ, కాంప్లెక్స్, శంబాల అనే మూడు పేర్లు వినిపించాయ్.

‘కల్కి’లో చూపించిన ‘శంబాల’ సంగతి దాదాపు ‘కల్కి’ సినిమా చూసినవాళ్లందరికీ తెలుసు. అయితే, ఇప్పుడు ఆది సాయి కుమార్ మరో ‘శంబాల’ని చూపించబోతున్నాడు.

‘శంబాల’ పేరుతో ఆది ఓ సినిమాలో నటిస్తున్నాడు. రీసెంట్‌గా ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు. సూపర్ నేచురల్ పవర్స్ బ్యాక్ డ్రాప్‌లో ఈ సినిమా వుండబోతోందనీ మేకర్లు ప్రకటించారు.

‘ఏ’ అనే ఓ డిఫరెంట్ మూవీతో పరిచయమైన యుగంధర్ ఈ సినిమాకి దర్శకుడు. ఫస్ట్ లుక్ పోస్టర్‌లో ఓ పాడుబడిన ఊరు, ఆకాశంలో భయానకమైన ఓ ఆకారం, ప్రళయానికి సంకేతం అన్నట్లుగా ఆకాశం నుంచి రాలి పడుతున్న ఉల్కలు..  భయంకరంగా కనిపిస్తున్న చుట్టూ పరిస్థితి.  భీకరం, భయానకం అన్నట్లుగా వున్న ఆ ఊరిలో ఒక్క మనిషి కూడా కనిపించడం లేదు.

ఇదీ ఈ పోస్టర్ పరిస్థితి. పోస్టర్ ఆసక్తికరంగా వుంది. సినిమా మరింత ఆసక్తికరంగా వుండబోతోందట. ఈ సినిమా కోసం హాలీవుడ్ రేంజ్ టెక్నికల్ టీమ్ వర్క్ చేస్తోందట. విజువల్స్ న భూతో న భవిష్యతి అనేలా వుండబోతున్నాయని చెబుతున్నారు. ప్యాన్ ఇండియా చిత్రంగా రూపొందుతోన్న ఈ సినిమాలో ‘జాంబి రెడ్డి’ ఫేమ్ ఆనంది, ఆదికి జోడీగా నటిస్తోంది.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com