బహ్రెయిన్ లోని గ్రాండ్ మాస్క్ లో రోజూ 400 మందికి ఇఫ్తార్ విందు
- July 07, 2015
బహ్రెయిన్ లోనే అతిపెద్డదైన జూఫ్ఫైర్ లోని అహ్మద్ అల్ ఫతే ఇస్లామిక్ సెంటర్ (గ్రాండ్ మాస్క్)లో రమదాన్ నెలలో ప్రతిరోజూ 400 మంది ఇఫ్తార్ విందుభోజనం చేస్తున్నారు. 2000 సంవత్సరం నుండి ఒక అజ్ఞాత ధార్మికుడు ప్రతి సంవత్సరం ఇస్తున్న ఈ విందులో ముస్లిములు, ముస్లిమేతరులు కూడా పాల్గొంటున్నారని, ఇంచుమించు 4000 బహ్రెయిన్ దీనర్లు ఖర్చయ్యే ఈ విందులో ఖర్జూరాలు, బియ్యం-మాంసం కలిపి వందే ఘౌజీ, నీరు, లాబాన్ మరియు పండ్ల రసం సరఫరా చేస్తామని, ఇందుకయే ఖర్చు ఆ అజ్ఞాత భక్తుడే భరిస్తున్నారని, ఆయన కోరిక మేరకు వివరాలు గోప్యంగా ఉంచుతున్నామని మసీదు సుపర్వైజర్ అబ్దుల్ రహమాన్ బుఖమ్మల్ తెలిపారు. ఈ మసీదులో సేవలందించేందుకు వాలెంటరీ రిటైర్మెంట్ తీసుకున్న ఇంజనీర్ శ్రీ బుఖమ్మల్, 20 సంవత్సరాల క్రితం మెట్టమొదట ఈ విందును ఏర్పాటు చేసినపుడు కేవలం 5గురు మాత్రమే హాజరవడాన్ని గుర్తుచేసుకున్నారు. ఇక్కడి రీతి రివాజులు తెలుసుకోగోరే విదేశీయులను, ముఖ్యంగా అమెరికా నేవీ ఉద్యోగులను ఆహ్వానిస్తామని, కాగా వారికి క్రింద కూర్చొని, కుడిచేతితో, ఒకే ప్లేటులో మిగిలిన 5 గురితో కలసి తినవలసినదిగా సూచిస్తామని, పవిత్ర ఖురాన్ లో కూడా ఇదేవిధంగా చెప్పబడిందని ఆయన తెలిపారు.
--యం.వాసుదేవ రావు(మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)
తాజా వార్తలు
- పిల్లలు, కార్మికులకు భరోసా ఇవ్వండి: కువైట్ అంతర్గత మంత్రిత్వ శాఖ విజ్ఞప్తి
- ఆన్లైన్లో మిస్ లీడ్ కంటెంట్ స్ప్రెడ్.. 194 మంది అరెస్టు..!!
- ఖతార్‌లోని అల్-ఉదీద్ వైమానిక స్థావరంపై డ్రోన్ దాడి..!!
- మనామాలో హోటళ్ళు, నివాస భవనానికి నష్టం..!!
- కువైట్‌లో చిక్కుకున్న ప్రయాణీకులతో టచ్ లో ఎంబసీ..!!
- మిడిల్ ఈస్ట్, ఒమన్‌లో CBSE పరీక్షలు రద్దు..!!
- అరబ్ దేశాలపై ఇరాన్ దాడులను ఖండించిన కౌన్సిల్..!!
- యూఏఈలో పరిమితంగా కమర్షియల్ ఫ్లైట్స్ ప్రారంభం..!!
- యూఏఈలోని ఇండియన్ సిలబస్ స్కూళ్లలో ఆన్లైన్లో ఎగ్జామ్స్..!!
- ప్రిన్స్ సుల్తాన్ ఎయిర్ బేస్ పై 3 మిస్సైళ్లతో దాడికి యత్నం..!!









