ఖతార్ బోట్ షో 2024.. నవంబర్ 6 నుండి ప్రారంభం..!!
- October 24, 2024
దోహా: ఖతార్ బోట్ షో 2024 ఓల్డ్ దోహా పోర్ట్‌లో నవంబర్ 6-9 తేదీలలో జరుగనుంది. విలాసవంతమైన సూపర్యాచ్లు, నౌకలు, అత్యుత్తమ పరిశ్రమ ఆవిష్కరణలు, ఉత్కంఠభరితమైన వాటర్స్పోర్ట్లు, వినోదభరితమైన వినోదం, ఫుడ్ రెస్టారెంట్లతోపాటు అద్భుతమైన ప్రదర్శనలు అలరించనున్నాయి. ఖతార్ బోట్ షో ఖతార్ సముద్ర సంస్కృతిలో ఒక అద్భుతమైన ఇమ్మర్షన్ అవుతుందని నిర్వాహకులు వెల్లడించారు. సందర్శకుల కోసం షోర్లైన్ డిస్ప్లే, 350కి పైగా మెరైన్ బ్రాండ్లు, అల్ దార్ మెరైన్, దోహా క్రాఫ్ట్ మెరైన్, జాసిమ్ అహ్మద్ అల్ లింగావి ట్రేడింగ్, స్పీడ్ బోట్ల నుండి ఆన్-గ్రౌండ్ బోట్ల వరకు అద్భుతమైన లైనప్ స్వాగతం పలుకనుంది.
ఓషియానిక్ డిస్ప్లేలో సందర్శకులు ఆల్డెన్ మెరైన్, అల్ ఫజెర్ మెరైన్, గల్ఫ్ క్రాఫ్ట్, ప్రిన్సెస్ యాచ్‌లు, సాన్లోరెంజో యాచ్‌లు, సన్సీకర్, క్రాంచి, సిరెనా యాచ్‌ల నుండి నీటిపై తెలియలాడే వినూత్న పడవలను వీక్షించవచ్చు. ఖతార్ బోట్ షో బెనెట్టి, ఫెడ్షిప్, ఓషన్కో, టర్కోయిస్ యాచ్లతో సహా ప్రముఖ యాచింగ్ లైఫ్‌స్టైల్ బ్రాండ్లను కూడా ఆస్వాదించవచ్చు. అదే విధంగా డైనమిక్ ఖతార్ బోట్ షో పోటీలు, మంత్రముగ్ధులను చేసే డ్యాన్సింగ్ ఫౌంటైన్లు, అద్భుతమైన ప్రత్యక్ష సంగీత ప్రదర్శనలను చూడవచ్చు. దాంతోపాటు కార్ పరేడ్, హార్స్ రైడ్, డ్రాగన్ బోట్ షో, నైట్ ఫైర్ వర్క్స్ లను సందర్శకులు ఆస్వాదించవచ్చు.
తాజా వార్తలు
- తెలుగు రాష్ట్రాలను అనుసరిస్తున్న న్యూయార్క్ కొత్త మేయర్..
- 'తానా ప్రపంచసాహిత్య వేదిక' ఆధ్వర్యంలో బాలల దినోత్సవం
- థియేటర్లలో తినుబండారాల ధరలు పై సుప్రీంకోర్టు ఆందోళన
- కువైట్ జ్లీబ్ అల్-షుయౌఖ్లోని 67 భవనాలకు నోటీసులు..!!
- ఇండియన్ ఎంబసీ ఓపెన్ హౌస్.. పలు ఫిర్యాదుల పరిష్కారం..!!
- సౌదీలో నాన్ ఆయిల్ గ్రోత్ లో ప్రైవేట్ రంగం కీలక పాత్ర..!!
- 4.6 తీవ్రతతో భూకంపం.. ముసాందంను తాకిన భూప్రకంపనాలు..!!
- ఖతార్‌లో FIFA U-17 ప్రపంచ కప్ 2025 ప్రారంభం..!!
- విషాదాంతం.. పోర్ట్ సుల్తాన్ కబూస్ సమీపంలో డెడ్ బాడీ లభ్యం..!!
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు







