యూఏఈలో డ్రైవర్ల కనీస వయోపరిమితి తగ్గింపు..!!
- October 26, 2024
యూఏఈ: యూఏఈ ప్రభుత్వం ట్రాఫిక్ నిబంధనలపై కొత్త ఫెడరల్ డిక్రీ చట్టాన్ని ప్రకటించింది. ఇది మార్చి 29, 2025 నుండి అమలులోకి వస్తుంది. 17 సంవత్సరాల వయస్సు ఉన్న వారు ఇప్పుడు డ్రైవింగ్ చేయడానికి లైసెన్స్ పొందేందుకు అనుమతించబడ్డారు. ఇంతకుముందు, కార్లు తేలికపాటి వాహనాలు నడపడానికి అర్హత పొందాలంటే కనీసం 18 సంవత్సరాలు నిండి ఉండాలి. సెల్ఫ్ డ్రైవింగ్, ఎలక్ట్రిక్ వాహనాల పెరుగుతున్న వినియోగానికి అనుగుణంగా ట్రాఫిక్ చట్టం కొన్ని మార్పులు చేసినట్టు అధికార యంత్రాంగం తెలిపింది. జాయ్ వాకింగ్, అల్కాహల్ డ్రైవింగ్ లాంటి వాటికి కొత్త చట్టంలో భారీగా జరిమానాలు విధించారు. అలాగే ఉల్లంఘన తీవ్రతను బట్టి డ్రైవింగ్ లైసెన్సులను రద్దు చేసేందుకు నిబంధనలను పొందుపరిచారు.
తాజా వార్తలు
- ప్రధాని మోదీ జన్మదిన వేడుకల్లో రక్తదాన మహోత్సవం
- ప్రభుత్వ సలహాదారుగా NVS రెడ్డి
- నేడు లండన్లో మంత్రి నారా లోకేశ్ నేతృత్వంలో రోడ్ షో
- సౌదీ అరేబియాలో భారీగా మాదకద్రవ్య పిల్స్ సీజ్..!!
- సమాహీజ్ ఇంట్లో అగ్నిప్రమాదం..ఒకరు మృతి..!!
- దుబాయ్ లో టెనంట్స్ కు బంపర్ డీల్స్..!!
- సోషల్ మీడియా ద్వారా ట్రాఫిక్ ఉల్లంఘనల పర్యవేక్షణ.!.!
- వాహనాల నుండి వస్తువుల చోరీ.. వ్యక్తి అరెస్టు..!!
- ఖతార్ కు సంఘీభావంగా నిలిచిన అరబ్-ఇస్లామిక్ దేశాలు..!!
- శ్రీవారి బ్రహ్మోత్సవాల బుక్లెట్ విడుదల