కిడ్నీలకు ముప్పుతెచ్చే డయాబెటీస్‌, బీపీ

- July 07, 2015 , by Maagulf
కిడ్నీలకు ముప్పుతెచ్చే డయాబెటీస్‌, బీపీ


మన శరీరంలో కిడ్నీలు రక్తాన్ని శుద్ధి చేయటంలో ప్రధాన పాత్ర వహిస్తాయి. కిడ్నీలలోని అతి చిన్న భాగాలు ముఖ్యంగా ఈ వడపోత పనిని చేయడం జరుగుతుంది. ఈ భాగాలను గ్లోమరులస్‌ అని అంటారు. ఇవి కిడ్నీల్లో లక్షల సంఖ్యలో ఉంటాయి. హైబీపీ ఉన్నవారిలో రక్తం అధిక పీడనం, ఒత్తిడి కలిగి ఈ గ్లోమరులస్‌ పొరలలోకి చేరడం వల్ల ఈ పొరలు కూడా అధికంగా పీడనానికి గురి కావడం జరుగుతుంది. దాంతో పొరల యొక్క గోడలు దళసరిగా మారడంతో వడపోత సామర్థ్యం తగ్గిపోవడం జరుగుతుంది. మధుమేహం ఉన్న వారి రక్తంలో గ్లూకోజ్‌ శాతం అధికంగా ఉంటుంది. ఈ అధిక గ్లూకోజ్‌ ఉన్న రక్తం గ్లోమరులస్‌ పొరలలోకి చేరడం వల్ల అక్కడ గ్లూకోజ్‌ శాతం ఎక్కువయి ఈ పొరలు తమ స్వభావాన్ని మార్చుకోవడం వల్ల వడపోత సామర్ధ్యం మరింత దెబ్బతినే అవకాశం ఉంది. కిడ్నీ సమస్యలను తెలుసుకోవడానికి చాలా మంది సీరం క్రియాటినన్‌ అనే పరీక్ష చేయించుకుంటుంటారు. అదొక్కటే పూర్తిగా కిడ్నీ సామర్థ్యాన్ని అంచనా వేయడానికి సరిపోదు. 'ఈజీఎఫ్‌ఆర్‌' అనే పరీక్ష చేయించుకోవడం ద్వారా కిడ్నీల పూర్తి పనితీరును తెలుసుకోవచ్చు. డాక్టర్ల సూచన మేరకు క్రమం తప్పకుండా స్కానింగ్‌, ఇతరత్రా పరీక్షలు చేయించుకుని, తగిన వైద్య సహాయం పొందితే మధుమేహులు, బీపీతో బాధపడ్తున్నవారు కిడ్నీలను సంరక్షించుకోవచ్చు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com