యూఏఈలో గ్రేడ్ 12 విద్యార్థులకు ‘ఎమ్సాట్’ రద్దు..!!
- November 04, 2024
యూఏఈ: ఎమిరేట్స్ లో మెడికల్, ఇంజినీరింగ్ ప్రోగ్రామ్‌లలో అడ్మిషన్ కోసం గ్రేడ్ 12 విద్యార్థులకు నిర్వహించే ఎమ్సాట్‌ను ప్రభుత్వం రద్దు చేసింది. దీని స్థానంలో విద్యార్థుల సైన్స్ సబ్జెక్ట్ గ్రేడ్‌లలో సాధించిన స్కోర్ ఆధారంగా ప్రవేశాన్ని కల్పించనున్నారు. విద్యార్థులు తమ విద్యా, కెరీర్ మార్గాల్లో తమ భవిష్యత్తు ఆశయాలను కొనసాగించడానికి కొత్త నిర్ణయం వీలు కల్పిస్తుందని మంత్రిత్వ శాఖ తెలిపింది. విద్య, మానవాభివృద్ధి, కమ్యూనిటీ డెవలప్‌మెంట్ కౌన్సిల్ ఆమోదం తర్వాత విద్యా మంత్రిత్వ శాఖ మరియు ఉన్నత విద్య, శాస్త్రీయ పరిశోధన మంత్రిత్వ శాఖ (MOHESR) ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. కొత్త విద్యావిధానంతో విద్యార్థులు ప్రయోజనం పొందుతారని విద్యా శాఖ మంత్రి సారా అల్ అమిరి అన్నారు. ఇప్పడు ప్రతి పన్నెండవ తరగతి స్టూడెంట్.. గ్రాడ్యుయేట్ బ్యాచిలర్స్, హయ్యర్ డిప్లొమా, డిప్లొమా లేదా స్కిల్స్ సర్టిఫికేట్ ప్రోగ్రామ్‌లలో సులువుగా చేరి ఉన్నత విద్యను కొనసాగించవచ్చని మానవ వనరులు, ఎమిరాటైజేషన్ మంత్రి డాక్టర్ అబ్దుల్ రెహ్మాన్ అల్ అవార్ తెలిపారు.
ఎమిరేట్స్ స్టాండర్డ్ టెస్ట్(ఎమ్సాట్) దేశంలోని వివిధ విద్యా స్థాయిలలో విద్యార్థుల నైపుణ్యాలను అంచనా వేయడానికి రూపొందించబడింది. ఈ పరీక్ష గతంలో దేశంలో విశ్వవిద్యాలయ ప్రవేశం, స్కాలర్‌షిప్‌ల కోసం పరిగణలోకి తీసుకునేవారు. 2023లో విద్యామంత్రిత్వ శాఖ నిబంధనలను సడలించింది. ఎమ్సాట్ ఫలితాలు విశ్వవిద్యాలయ ప్రవేశాలకు ఐచ్ఛికం చేశారు. ఈ నిర్ణయం 2023-2024 విద్యా సంవత్సరం నుండి అమల్లోకి వచ్చింది.
గ్రేడ్ 12 విద్యార్థులు యూఏఈ పాస్‌ని ఉపయోగించి ఎమిరేట్స్ స్టాండర్డ్ టెస్ట్ అధికారిక వెబ్‌సైట్ ద్వారా స్వీయ-రిజిస్టర్ చేసుకోవాలి. నాలుగు తప్పనిసరి సబ్జెక్టులకు (ఇంగ్లీష్, అరబిక్, మ్యాథ్, ఫిజిక్స్) ఇతర సబ్జెక్టుకు 100 దిర్హామ్ చెల్లించాలి. గ్రేడ్ 12 నాన్-యూఏ జాతీయులకు, నాలుగు తప్పనిసరి సబ్జెక్టులకు రుసుము Dh300, ఒక్కోసబ్జెక్టుకు Dh100 చెల్లించాలి. గ్రేడ్ 12 అభ్యర్థులందరికీ, రీ-టెస్ట్ అటెంప్ట్ ఫీజు ఒక్కో సబ్జెక్టుకు Dh100గా నిర్ణయించారు. నాన్-గ్రేడ్ 12 అభ్యర్థులు ఒక్కో సబ్జెక్ట్‌కు 250 దిర్హామ్‌లు చెల్లించాల్సి ఉంటుంది.
తాజా వార్తలు
- ప్రధాని మోదీ జన్మదిన వేడుకల్లో రక్తదాన మహోత్సవం
- ప్రభుత్వ సలహాదారుగా NVS రెడ్డి
- నేడు లండన్లో మంత్రి నారా లోకేశ్ నేతృత్వంలో రోడ్ షో
- సౌదీ అరేబియాలో భారీగా మాదకద్రవ్య పిల్స్ సీజ్..!!
- సమాహీజ్ ఇంట్లో అగ్నిప్రమాదం..ఒకరు మృతి..!!
- దుబాయ్ లో టెనంట్స్ కు బంపర్ డీల్స్..!!
- సోషల్ మీడియా ద్వారా ట్రాఫిక్ ఉల్లంఘనల పర్యవేక్షణ.!.!
- వాహనాల నుండి వస్తువుల చోరీ.. వ్యక్తి అరెస్టు..!!
- ఖతార్ కు సంఘీభావంగా నిలిచిన అరబ్-ఇస్లామిక్ దేశాలు..!!
- శ్రీవారి బ్రహ్మోత్సవాల బుక్లెట్ విడుదల