జజాన్ సముద్రంలో సౌదీ కుటుంబాన్ని రక్షించిన బోర్డర్ గార్డ్..
- November 04, 2024
రియాద్: జజాన్ ప్రాంతంలో బోర్డర్ గార్డ్ సెర్చ్ అండ్ రెస్క్యూ బృందాలు సముద్రంలో మునిగిపోతున్న సౌదీ కుటుంబాన్ని రక్షించారు. నిషేధిత ప్రాంతాల్లో ఈత కొడుతూ మునిగిపోతున్న సౌదీ పౌరుడు, అతని ఇద్దరు కుమార్తెలను రెస్క్యూ టీమ్ రక్షించింది. వారికి అవసరమైన సహాయాన్ని అందించి సురక్షితంగా తీరానికి తీసుకొచ్చారు. సందర్శకులు, విహారయాత్రకు వెళ్లేవారు జాగ్రత్తగా ఉండాలని, నిర్దేశిత ప్రాంతాలలో మాత్రమే ఈత కొట్టడం ద్వారా సముద్ర భద్రత మార్గదర్శకాలను పాటించాలని జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ బోర్డర్ గార్డ్ కోరింది. అత్యవసర సహాయం కోసం మక్కా,తూర్పు ప్రావిన్స్ ప్రాంతాలలో 911 నంబర్‌కు.. కింగ్‌డమ్‌లోని ఇతర ప్రాంతాలలో 994 నంబర్‌ను సంప్రదించాలని డైరెక్టరేట్ ప్రజలకు సూచించింది.
తాజా వార్తలు
- ప్రధాని మోదీ జన్మదిన వేడుకల్లో రక్తదాన మహోత్సవం
- ప్రభుత్వ సలహాదారుగా NVS రెడ్డి
- నేడు లండన్లో మంత్రి నారా లోకేశ్ నేతృత్వంలో రోడ్ షో
- సౌదీ అరేబియాలో భారీగా మాదకద్రవ్య పిల్స్ సీజ్..!!
- సమాహీజ్ ఇంట్లో అగ్నిప్రమాదం..ఒకరు మృతి..!!
- దుబాయ్ లో టెనంట్స్ కు బంపర్ డీల్స్..!!
- సోషల్ మీడియా ద్వారా ట్రాఫిక్ ఉల్లంఘనల పర్యవేక్షణ.!.!
- వాహనాల నుండి వస్తువుల చోరీ.. వ్యక్తి అరెస్టు..!!
- ఖతార్ కు సంఘీభావంగా నిలిచిన అరబ్-ఇస్లామిక్ దేశాలు..!!
- శ్రీవారి బ్రహ్మోత్సవాల బుక్లెట్ విడుదల