టైటిల్ మార్చకుంటే ఉద్యమమే...
- June 24, 2016
ఉపేంద్ర, సలోని, రాగిణి ద్వివేది హీరో హీరోయిన్లుగా 'బ్రాహ్మణ' చిత్రం రానుంది. శ్రీనివాస్ రాజు డైరెక్షన్ లో వచ్చిన కన్నడ చిత్రం 'శివం' ఘన విజయం సాధించింది. ఇదే సినిమాని ఇప్పుడు బ్రహ్మణ పేరుతో తెలుగులోకి డబ్ చేసారు. అయితే టైటిల్ "బ్రాహ్మణ" వెంటనే మార్చాలని, కులం పేరుతో సినిమాలు తీస్తే బ్రాహ్మణుల మనోభావాలు దెబ్బతింటాయని "బ్రాహ్మణ్స్ యూనిట్ ఫర్ ఎవర్ కో ఆర్డినేటర్స్" ఆలూరి, గోగులపాటి కృష్ణమోహన్, పిల్లుట్ల ఆనంద్ మోహన్ డిమాండ్ చేశారు.
బుధవారం ప్రాంతీయ సెన్సార్ బోర్డు అధికారి తుమ్మా విజయ్‌కుమార్‌రెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశారు. ఇప్పటికే బ్రాహ్మణులపై అనేక రకాలుగా దాడులు జరుగుతున్నాయని, దీనికి తోడు సినిమా టైటిళ్లకు కూడా ఆ పేర్లు పెట్టడం, సినిమాల్లో వేష, భాషలను అపహాస్యం చేస్తూ బ్రాహ్మణులను కించపరుస్తున్నట్లు వారు వినతిపత్రంలో పేర్కొన్నారు. ఇక నుంచి బ్రాహ్మణులను కించపరిచే విధంగా సినిమాలు తీస్తే సహించేది లేదన్నారు.నిజామా బాద్ లోని గాయత్రీ ధార్మిక వేదిక జిల్లా అధ్యక్షుడు చంద్రశేఖర్‌శర్మ కూడా ఇదే డిమాండ్‌ని చేసారు. ఎల్లమ్మగుట్ట ఆంజనేయస్వామి ఆలయంలో అర్చక సమాఖ్య ప్రతినిధులు సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా శర్మ మాట్లాడారు.
నిత్యం దేవతారాధన, దీపారాధనలతో పాటు లోకకల్యాణార్థం అనేక కార్యక్రమాలను నిర్వహిస్తున్న బ్రాహ్మణులపై దాడులు జరపటమే కాకుందా సినిమాలకు పేర్లు పెట్టి తమను కించపరుస్తూ. బ్రాహ్మణుల మనోభావాలను దెబ్బతీయొద్దన్నారు. సినిమా పేరు మార్చకుంటే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన చేస్తామని కూడా వారు హెచ్చరించారు
తాజా వార్తలు
- యూఏఈలో మార్చి 20న ఈద్ అల్ ఫితర్? ఖగోళ శాస్త్రవేత్తల తాజా అంచనా!
- అబుదాబిలో ఇండెక్స్ రెస్టారెంట్ మూసివేత..!!
- దోహాకు పరిమితంగా ఫ్లైట్ సర్వీసులు: ఖతార్ ఎయిర్వేస్
- ఖతార్ లో ఫేక్ షెల్టర్ లొకేషన్ మెసేజులపై GCO క్లారిటీ..!!
- సివిల్ డిఫెన్స్ కు 90 అత్యవసర ఫిర్యాదులు..ఆల్ నార్మల్..!!
- కువైట్‌లో మత కలహాలను రెచ్చగొట్టే కుట్ర..13 మంది అరెస్టు..!!
- ప్రాంతీయ పరిణామాలపై జీసీసీ అఫిషియల్స్ సమీక్ష..!!
- టార్గెట్ షైబా ఫీల్డ్..16 డ్రోన్లను కూల్చిన సౌదీ అరేబియా..!!
- CBSE 12వ తరగతి బోర్డు పరీక్షలు వాయిదా..!!
- ఇరాన్ సుప్రీం లీడర్ నియామకంపై గందరగోళం









