జేవీ రమణమూర్తి అంతిమ సంస్కారాలు పూర్తి

- June 24, 2016 , by Maagulf
జేవీ రమణమూర్తి అంతిమ సంస్కారాలు పూర్తి

రెండ్రోజుల కిందట గుండెపోటుతో మృతి చెందిన ప్రముఖ సీనియర్‌ నటుడు, రంగస్థల కళాకారుడు జేవీ రమణమూర్తి అంత్యక్రియలు పూర్తయ్యాయి. పంజాగుట్ట శ్మశాన వాటికలో ఆయన కుమారులు అరుణ్‌కుమార్‌, హర్షవర్దన్‌ అంతిమ సంస్కారాలు నిర్వహించారు. అంతకుముందు స్టార్‌ ఆసుపత్రి నుంచి రమణమూర్తి భౌతికకాయాన్ని అమీర్‌పేటలోని స్వగృహానికి తరలించారు. బంధువులు, కుటుంబ సన్నిహితులతో పాటు పలువురు సినీ నటులు, రంగస్థల నటులు రమణమూర్తి భౌతికకాయానికి నివాళులర్పించారు. నాటక, సినీ రంగంలో ఆయన చేసిన సేవలను గుర్తుకు తెచ్చుకొని కంటతడి పెట్టారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com