రేపు చంద్ర‌బాబు చేతుల మీదుగా ప్రారంభం కానున్న శ్రీశైలం–విజ‌య‌వాడ మ‌ధ్య సీ ప్లేన్ స‌ర్వీస్ లు

- November 08, 2024 , by Maagulf
రేపు చంద్ర‌బాబు చేతుల మీదుగా ప్రారంభం కానున్న శ్రీశైలం–విజ‌య‌వాడ మ‌ధ్య సీ ప్లేన్ స‌ర్వీస్ లు

అమ‌రావ‌తి: ఏపీలో తొలిసారిగా సీ ప్లేన్ స‌ర్వీస్ లు ప్రారంభం కానున్నాయి.విజ‌య‌వాడ నుంచి శ్రీశైలంకు ఈ స‌ర్వీస్ లు న‌డ‌వ‌నున్నాయి.డీ హవిల్లాండ్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌ సంస్థ రూపొందించిన 14 సీట్ల సీ ప్ల్లేన్‌ను స‌ర్వీస్ లు సీఎం చంద్రబాబు రేపు శ్రీశైలంలో లాంచ‌నంగా ప్రారంభించ‌నున్నారు.ఈ నేప‌థ్యంలో నేడు విజయవాడ పున్నమి ఘాట్​ నుంచి శ్రీశైలం జలాశయానికి సీప్లేన్​ విమానం ట్రైల్​ రన్​ నిర్వహించారు.విమానం స‌క్సెస్ ఫుల్ గా ల్యాండైంది. అనంతరం శ్రీశైలం టూరిజం బోటింగ్ జట్టి వద్దకు సీ ప్లేన్‌ చేరుకుంది.ఎస్డీఆర్‌ఎఫ్‌, పోలీసు, టూరిజం, ఎయిర్ ఫోర్స్ అధికారుల సమక్షంలో ట్రయల్ రన్‌ నిర్వహించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com