కొలెస్ట్రాల్ ఈ కారణాల వల్లే పెరుగుతుంది

- November 14, 2024 , by Maagulf
కొలెస్ట్రాల్ ఈ కారణాల వల్లే పెరుగుతుంది

కొలెస్ట్రాల్ పెరగడానికి చాలా కారణాలు ఉన్నాయి.బాడీలో కొలెస్ట్రాల్ పెరిగేకొద్దీ ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం పెరుగుతుంది.ముందునుంచే ఈ సమస్యని తగ్గించుకోవాలి. ఎందుకు సమస్య వస్తుందో తెలుసుకోవాలి.దీంతో ఆ అలవాట్లని దూరం చేసుకుని కొలెస్ట్రాల్ పెరగకుండా కాపాడుకోవచ్చు.అసలు కొలెస్ట్రాల్ ఎందుకు పెరుగుతుందో తెలుసుకోండి.

కొంతమందికి జన్యుకారణాలు ఉంటాయి. అంటే వారి కుటుంబంలోని సభ్యులెవరైనా కొలెస్ట్రాల్‌తో బాధపడితే ఆ సమస్య మనకి వచ్చే అవకాశం ఉంది.ఈ విషయాన్ని కూడా గమనించాలి. మనం ఆరోగ్య సమస్యలకి వాడే మందుల కారణంగా కూడా బాడీలో కొలెస్ట్రాల్ లెవల్స్ పెరుగుతాయి. అన్నీ మెడిసిన్స్ కొలెస్ట్రాల్‌ని పెంచకపోయినా కొన్ని మెడిసిన్స్ ఈ కొలెస్ట్రాల్‌ని పెంచుతాయి. లైఫ్‌స్టైల్ సరిగా లేకపోవడం వల్ల కొలెస్ట్రాల్ పెరుగుతుంది. శాచ్చ్యురేటెడ్ ఫ్యాట్స్ తీసుకోవడం, ఎక్సర్‌సైజ్ చేయకపోవడం, స్మోకింగ్, డ్రింకింగ్ ఎక్కువగా చేయడం వల్ల కొలెస్ట్రాల్ పెరుగుతుంది.

ఆరోగ్య సమస్యలు అంటే టైప్ 2 డయాబెటిస్, ఒబేసిటీ వంటి సమస్యలున్నా బాడీలో కొలెస్ట్రాల్ పెరుగుతుంది.కాబట్టి, వీటిని కంట్రోల్ చేసుకోవడం చాలా ముఖ్యం.లేదంటే కొలెస్ట్రాల్ పెరిగి ఇతర సమస్యలు వస్తాయి.ఒత్తిడి కారణంగా కూడా బాడీలో కొలెస్ట్రాల్ పెరుగుతుంది. ఒత్తిడి కారణంగా నేరుగా కొలెస్ట్రాల్ స్థాయిలు పెరగవు. కానీ, దీని వల్ల అన్‌హెల్దీ లైఫ్‌స్టైల్, ఇతర అలవాట్లు పెరుగుతాయి. దీంతో కొలెస్ట్రాల్ పెరుగుతుంది.

ప్రజెంట్ చిన్నపిల్లలు కూడా కొలెస్ట్రాల్ సమస్యతో బాధపడతారు. కానీ, 40 ఏళ్ళు పైబడిన వారికి ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది. వయసు పెరిగేకొద్దీ కాలేయం చెడు కొలెస్ట్రాల్‌ని తక్కువగా తొలగిస్తుంది. దీంతో బాడీలో కొలెస్ట్రాల్ పెరుగుతుంది. 

--డి.వి.అరవింద్(మాగల్ఫ్ ప్రతినిధి)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com