నారా వారి ఇంట విషాదం..చంద్రబాబు కు తీరని లోటు..ఆ హీరో కు ఎంగేజ్మెంట్ అయిన నెలలోపే ఇలా..
- November 16, 2024
టాలీవుడ్ హీరో నారా రోహిత్ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. నిజానికి నారా రోహిత్ ఈ మధ్యకాలంలో తాను ప్రేమించిన శిరీష అనే యువతిని పెళ్లి చేసుకునేందుకు నిశ్చితార్థం చేసుకున్నారు.
త్వరలోనే పెళ్లి కూడా చేసుకుని ఎందుకు సిద్ధమవుతున్నాడు. ఈ సమయంలో ఆయన తండ్రి, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోదరుడు రామ్మూర్తి నాయుడు హఠాన్మరణం పాలయ్యారు. ఈ విషయాన్ని నారా రోహిత్ టీం స్వయంగా ప్రకటించింది. నారా రోహిత్ తండ్రి, చంద్రబాబు నాయుడు తమ్ముడు రామ్మూర్తి నాయుడు కార్డియాక్ అరెస్టు కారణంగా ఈరోజు మరణించారు.
ఆయన అంత్యక్రియలు రేపు రామ్మూర్తి నాయుడు స్వగ్రామం నారావారిపల్లెలో జరగబోతున్నాయి అంటూ ప్రకటించారు. ఇక ఈ ఉదయం రామ్మూర్తి నాయుడు ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని తెలిసి నారా లోకేష్ హుటాహుటిన తన కార్యక్రమాలు అన్ని రద్దు చేసుకుని హైదరాబాదు వచ్చారు. అలాగే చంద్రబాబు సైతం మహారాష్ట్ర ఎన్నికల ప్రచారానికి వెళ్లాల్సి ఉంది కానీ దానిని కూడా ఆయన రద్దు చేసుకుని హైదరాబాద్ బయలుదేరారు. రామ్మూర్తి నాయుడు గత కొంతకాలంగా అనేక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఆయనను ప్రస్తుతం ఏఐజి హాస్పిటల్ లో చేర్చి చికిత్స అందిస్తున్నారు. అయితే ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఆయన కన్నుమూశారు. రామ్మూర్తి మరణంపై నందమూరి రామకృష్ణ సంతాపం ప్రకటించారు. వెంటనే ఆసుపత్రికి చేరుకున్న రామ కృష్ణ… కుటుంబ సభ్యులకి ప్రగాఢ సానుభూతి తెలిపారు.
తాజా వార్తలు
- ఇన్స్టాగ్రామ్ లో కొత్త ఫీచర్...
- ఎనిమిది బోర్డులకు డెవలప్మెంట్ అవార్డ్స్ ప్రకటించిన ICC
- హైమా నుండి నిజ్వాకు క్షతగాత్రుల ఎయిర్ లిఫ్ట్..!!
- డిపొర్టీస్ యూఏఈకి తిరిగి రావచ్చా? దరఖాస్తు ఎలా?
- శాశ్వతంగా కన్నుమూసిన ‘స్లీపింగ్ ప్రిన్స్’..!!
- ప్రపంచ వ్యాపార కేంద్రంగా సౌదీ అరేబియా..నైపుణ్య-ఆధారిత వర్క్ పర్మిట్..!!
- ప్రపంచంలోనే అతిపెద్ద ఉద్యానవనం.. "అతీన్ స్క్వేర్" ప్రారంభం..!!
- ఆకస్మిక తనిఖీలు.. 10 టన్నుల కుళ్లిన సీ ఫుడ్ సీజ్..!!
- తెలంగాణ సచివాలయంలో ఈ-పాస్ విధానం..
- హైదరాబాద్లో ఆగస్టు 10న 'రన్ ఫర్ SMA–2025'