ప్యాంక్రియాటిక్ క్యాన్సర్‌‌తో బాధపడేవారు ఇవి తీసుకుంటే మంచిది

- November 16, 2024 , by Maagulf
ప్యాంక్రియాటిక్ క్యాన్సర్‌‌తో బాధపడేవారు ఇవి తీసుకుంటే మంచిది

ప్యాంక్రియాటిక్ క్యాన్సర్‌ ట్రీట్‌మెంట్ తీసుకున్నప్పుడు కొన్ని సైడ్‌ఎఫెక్ట్స్ ఉంటాయి. అందులో వికారం, వాంతులు, అతిసారం, మలబద్ధకం, డీహైడ్రేషన్, కడుపు ఉబ్బరం, గుండెల్లో మంట, నోటి పూత, నాలుక రుచిగా అనిపించకపోవడం, నోరు పొడిబారడం, బరువు పెరగడం తగ్గడం వంటివి ఉంటాయి. అయితే, ఇలాంటి టైమ్‌లో మంచి మెల్దీ డైట్ తీసుకుంటే చాలా వరకూ ఈ సైడ్ ఎఫెక్ట్స్‌ని తగ్గించుకోవచ్చు. కాబట్టి, హెల్దీ డైట్ అదే విధంగా, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలుసుకోండి.

ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ సమస్య బరువు తగ్గడానికి కారణమవుతుంది. దీని వల్ల ఇమ్యూనిటీ కూడా బలహీనమవుతుంది. దీంతో ట్రీట్‌మెంట్ ఎఫెక్ట్ తగ్గుతుంది. కాబట్టి, రెగ్యులర్‌గా బరువుని చెక్ చేయండి. వారానికి ఒక కిలో బరువు కంటే ఎక్కువగా తగ్గితుంటే ఆ సమస్యని దూరం చేసేందుకు కేలరీలు, ప్రోటీన్ తీసుకోవడం మంచిది.

రోజులో ఒకేసారి ఎక్కువ భోజనం చేయకుండా రోజు మొత్తంలో కొద్దికొద్దిగా తినడం మంచిది. ఇది కూడా పోషకాహారం తీసుకోండి. ఎక్కువగా ప్రోటీన్, ఈజీగా జీర్ణమయ్యే భోజనం తీసుకుంటే శక్తి తగ్గకుండా ఉంటుంది. దీంతో కణాలు ఆరోగ్యంగా ఉంటాయి. ఇమ్యూనిటీ పెంచేందుకు ప్రోటీన్ ముఖ్యం. కాబట్టి, మీ ఫుడ్‌లో ఎక్కువ ప్రోటీన్ రిచ్ ఫుడ్ తీసుకోండి. ప్రతి మీల్‌లో గుడ్లు, ఉడికించిన కాల్చిన చికెన్, పప్పులు, నట్స్, గ్రెయిన్స్, లో ఫ్యాట్ మిల్క్ ప్రొడక్ట్స్, సోయా, టోఫు వంటి లీన్‌ ప్రోటీన్ తీసుకోండి.

రోజుకి 8 గ్లాసుల నీరు తాగడం మంచిది. భోజనం చేయడానికి గంట ముందు, తర్వాత డ్రింక్స్ తీసుకోండి. అల్లం టీ, మిల్లెట్ వాటర్, జీలకర్ర పొడి కలిపిన మజ్జిగ వంటి పోషకాలు ఎక్కువగా ఉండే డ్రింక్స్ తీసుకోండి. ఎక్కువగా కెఫిన్, ఆల్కహాల్‌ని తగ్గించండి. ఘన ఆహారాలు జీర్ణమవ్వడానికి కష్టంగా ఉన్నప్పుడు ప్రోటీన్ షేక్స్, బాదం మిల్క్, ఫ్రూట్ స్మూతీస్ వంటి పోషకాలు ఎక్కువగా ఉండే డ్రింక్స్ తీసుకోండి. దీని వల్ల అవసరమైన కేలరీలు, ప్రోటీన్స్ అందుతాయి.

యాంటీ ఆక్సిడెంట్ ఎక్కువగా ఉండే పండ్లు, కూరగాయలు శరీరంలో మంటతో పోరాడేందుకు, ఇమ్యూనిటీ పెంచేందుకు హెల్ప్ చేస్తాయి. క్యారెట్స్, బచ్చలికూర, బెల్ పెప్పర్స్, సీజనల్ ఫ్రూట్స్ తీసుకోవడం మంచిది. ఆలివ్ ఆయిల్, నట్స్, అవకాడో వంటి హెల్దీ ఫ్యాట్స్ తీసుకుంటే శక్తి అందుతుంది. వాపు తగ్గేందుకు పండ్లు, కూరగాయలు, హోల్ గ్రెయిన్స్, పసుపు, మసాలా దినుసులు తీసుకోవాలి.

షుగర్ ఎక్కువగా ఉండే ఫుడ్స్ రక్తంలో షుగర్ లెవల్స్ పెంచుతాయి. దీంతో జీర్ణమవ్వడం కష్టమవుతుంది. పండ్ల వంటి పోషకాలు ఎక్కువగా ఉండేవాటిని చక్కెర బదులు తీసుకోవచ్చు. స్వీట్స్ తయారు చేసేటప్పుడు ఖర్జూరం, నట్స్ వంటివాటిని వాడొచ్చు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com