ఎమిర్‌ని అవమానిస్తే ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హులు
- June 25, 2016
కువైట్, ఎలక్టోరల్ చట్టానికి కొత్త సవరణ చేసింది. ఈ చట్ట సవరణతో ఎమిర్‌ని అవమానించేలా వ్యాఖ్యానించేవారికి ఎన్నికల్లో పోటీ చేసే అర్హత ఉండదు. బుధవారం పార్లమెంటు ఈ చట్ట సవరణను ఆమోదించింది. గాడ్, ప్రొఫెట్స్, ఎమిర్ తదితరుల్ని అవమానించేలా వ్యాఖ్యానించేవారికి ఎన్నికల్లో పోటీ చేసే అర్హత లేకుండా ఎలక్టోరల్ చట్టానికి సవరణ తీసుకువచ్చారు. ఈ సవరణ ద్వారా మాజీ ఎంపి ముసల్లమ్ అల్ బర్రాక్‌కి ఎన్నికల్లో పోటీ చేసే అర్హత ఉండదు. 2012లో ఆయన చేసిన వివాదాస్పద వ్యాఖ్యలకుగాను జైలుపాలయ్యారు. కువైట్, సహచర దేశాలతో పోల్చితే వాక్ స్వాతంత్రాన్ని బాగానే కల్పించినా, రాజ్యాంగం ప్రకారం ఎమిర్‌కి ప్రత్యేక గౌరవాలున్న దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నారు. ఎమిర్‌ని అవమానించేవారికి ఐదేళ్ళ వరకు జైలు శిక్ష తప్పదు.
తాజా వార్తలు
- దోహాకు పరిమితంగా ఫ్లైట్ సర్వీసులు: ఖతార్ ఎయిర్వేస్
- ఖతార్ లో ఫేక్ షెల్టర్ లొకేషన్ మెసేజులపై GCO క్లారిటీ..!!
- సివిల్ డిఫెన్స్ కు 90 అత్యవసర ఫిర్యాదులు..ఆల్ నార్మల్..!!
- కువైట్లో మత కలహాలను రెచ్చగొట్టే కుట్ర..13 మంది అరెస్టు..!!
- ప్రాంతీయ పరిణామాలపై జీసీసీ అఫిషియల్స్ సమీక్ష..!!
- టార్గెట్ షైబా ఫీల్డ్..16 డ్రోన్లను కూల్చిన సౌదీ అరేబియా..!!
- CBSE 12వ తరగతి బోర్డు పరీక్షలు వాయిదా..!!
- ఇరాన్ సుప్రీం లీడర్ నియామకంపై గందరగోళం
- గద్దర్ ఫిలిం అవార్డ్స్: విజేతల పూర్తి జాబితా ఇదే!
- బెంగళూరుకు రెండో అంతర్జాతీయ విమానాశ్రయం!









