సదరన్ గవర్నరేట్ లో ఎడారి సీజన్.. క్యాంపులను తనిఖీలు చేసిన గవర్నర్..!!

- November 23, 2024 , by Maagulf
సదరన్ గవర్నరేట్ లో ఎడారి సీజన్.. క్యాంపులను తనిఖీలు చేసిన గవర్నర్..!!

మనామా: సదరన్ గవర్నరేట్ గవర్నర్ హిస్ హైనెస్ షేక్ ఖలీఫా బిన్ అలీ అల్ ఖలీఫా ఎడారి సీజన్‌ సేవల కేంద్రాన్ని అధికారికంగా సందర్శించారు. ఆయనవెంట డిప్యూటీ గవర్నర్ బ్రిగేడియర్ హమద్ మొహమ్మద్ అల్ ఖయ్యత్, సదరన్ గవర్నరేట్ అధికారులు, ముఖ్య అధికారులు ఉన్నారు. ఎడారి సీజన్ నవంబర్ 20న ప్రారంభమైందని 2025, ఫిబ్రవరి 20 వరకు కొనసాగనుంది. ఈ సందర్భంగా ఎడారి సందర్శకుల భద్రత, అత్యాధునిక సౌకర్యాలు, అధునాతన పరికరాలను గుర్తించి, కొత్తగా అమర్చిన ఎడారి సేవల కేంద్రాన్ని హిస్ హైనెస్ పరిశీలించారు. సురక్షితమైన, వ్యవస్థీకృత క్యాంపింగ్ సీజన్‌ను అందించేందుకు జనరల్ ట్రాఫిక్ డిపార్ట్‌మెంట్, సివిల్ డిఫెన్స్ డైరెక్టరేట్, సదరన్ గవర్నరేట్ పోలీస్ డైరెక్టరేట్, నేషనల్ అంబులెన్స్ సెంటర్‌ సహా సంస్థలు సమన్వయంతో సేవలు అందించాలని ఆదేశించారు.  విజువల్ ప్రెజెంటేషన్ "అల్ జనోబియా" అప్లికేషన్ ద్వారా అందుబాటులో ఉన్న డిజిటల్ రిజిస్ట్రేషన్ ప్రక్రియను ఫాలో కావాలని, ఎలక్ట్రానిక్‌గా నమోదు చేసుకుని క్యాంపింగ్ స్థానాలను ఎంచుకోవాలని సూచించారు. ఇప్పటివరకు 2,800 మంది క్యాంపులకు రిజిస్ట్రేషన్ చేసుకున్నారని తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com