నవంబర్ 28 నుండి అల్ ఘోర్.. ఐదు రోజుల సాంస్కృతిక వేడుకలు..!!
- November 23, 2024
దోహా: రాబోయే ఐదు రోజుల ఈవెంట్ లో పాల్గొనాలని ఖతార్ ఫౌండేషన్ అల్ ఘోర్హ్ ఫర్ లిటరేచర్ అండ్ ఆర్ట్స్ ఆహ్వానిస్తుంది. సంప్రదాయం, వారసత్వాన్ని ప్రదర్శించే సాంస్కృతిక ప్రయాణంలో భాగస్వామ్యులు కావాలని ఖతార్ కమ్యూనిటీని ఆహ్వానిస్తోంది. అల్ ఘోర్ నవంబర్ 28 నుండి డిసెంబర్ 2 వరకు ఎడ్యుకేషన్ సిటీలో జరుగుతుంది. ఈ సందర్భంగా స్థానిక, ప్రాంతీయ ప్రతిభను ప్రదర్శించే వివిధ రకాల సంగీత, నాటక ప్రదర్శనలను ప్రదర్శించనున్నారు. ల్ ఘోరా కోసం టిక్కెట్‌లు www.educationcity.qa/al-ghorrahలో అందుబాటులో ఉన్నాయి. పిల్లలకు QR35, పెద్దలకు QR50, ప్రత్యేక వర్క్‌షాప్‌ల కోసం QR200గా నిర్ణయించినట్లు నిర్వాహకులు ప్రకటించారు. ఈవెంట్ ప్రారంభం రోజున డానా అల్ ఫర్దాన్ నిర్మించిన ‘1001 నైట్స్: ఎ జర్నీ త్రూ ది స్టార్మ్’ పేరుతో ఖతార్ ఫిల్హార్మోనిక్ ఆర్కెస్ట్రా (QPO) ప్రత్యేక ప్రదర్శన ఉంటుందన్నారు.
తాజా వార్తలు
- స్పీడ్‌మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్‌పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!
- కువైట్ లో 28 ఏళ్ల తర్వాత కేరళ సీం విజయన్..!!
- మదీనాలో ఇద్దరు మహిళలు సహా ముగ్గురు అరెస్ట్..!!
- ఖతార్ లో సీజనల్ వెజిటేబుల్ మార్కెట్లు ప్రారంభం..!!
- ఫోన్ చార్జర్ వాడకంపై ప్రభుత్వం సూచనలు
- ప్రముఖ డా.చలమలశెట్టి సురేంద్రనాథ్ మృతి
- భక్తులకు గుడ్ న్యూస్..2 గంటల్లోనే శ్రీవారి దర్శనం!
- కొనకళ్ల నారాయణ అధ్యక్ష తన ఏపీఎస్ఆర్టీసీ పాలకమండలి సమావేశం







