గంటల తరబది రోడ్లపైనే.. ట్రాఫిక్ ఒత్తిడిలో నివాసితులు.. ఎలా ఎదుర్కోవాలి?

- November 23, 2024 , by Maagulf
గంటల తరబది రోడ్లపైనే.. ట్రాఫిక్ ఒత్తిడిలో నివాసితులు.. ఎలా ఎదుర్కోవాలి?

దుబాయ్: భారీ ట్రాఫిక్‌ జామ్ కారణంగా గంటలకొద్ది సమయంలో ట్రాఫిక్ లో గడపడం కారణంగా వాహనదారుల్లో మానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావాలను చూపుతుందని, ఇది తరచుగా చిరాకు, చిరాచ కోపం సమస్యలకు దారితీస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. షార్జాలోని అల్ ఖాన్ నుండి జెబల్ అలీలోని తన కార్యాలయానికి సమయానికి చేరుకోవడానికి తెల్లవారుజామునే బయటుదేరతానని, లేదంటే గంటల పాటు ట్రాఫిక్ లో చిక్కుకుపోవాల్సి వస్తుందని షార్జా నివాసి జైద్ ఒసామా తెలిపారు. ముందుగానే బయలుదేరడం ఆలస్యం అనేది తగ్గిస్తుదని, ఇది ఖర్చుతో కూడుకున్నది. "నేను చాలా వ్యక్తిగత సమయాన్ని కోల్పోయాను,  కుటుంబాన్ని చూడలేను." అన్నారాయన. మిర్డిఫ్ నుండి దుబాయ్ సిలికాన్ ఒయాసిస్‌కు ప్రతిరోజూ ప్రయాణించే జానాకు (అభ్యర్థనపై పేరు మార్చబడింది), ట్రాఫిక్ అనూహ్యత నిరంతరం నిరాశ కలిగిస్తుంది. "నేను మూడు గంటలు ముందుగా బయలుదేరినప్పటికీ, ప్రమాదాలు లేదా ఆకస్మిక రహదారి పనులతో గంటల తరబడి రోడ్లపై ఇరుక్కుపోయేలా చేస్తుందన్నారు. సంగీతం, గైడెడ్ మెడిటేషన్ యాప్‌ల వైపు మొగ్గు చూపింది. అయితే, ఈ పరిష్కారాలు పాక్షికంగా మాత్రమే ప్రభావవంతంగా ఉంటాయని తెలిపారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com