యూఏఈలో నవంబర్ 25 నుండి డ్రోన్ల పై నిషేధం ఎత్తివేత..!!
- November 24, 2024
యూఏఈ: డ్రోన్ కార్యకలాపాలపై యూఏఈ నిషేధం ఎత్తివేయనుంది.నవంబర్ 25 నుండి దశలవారీగా డ్రోన్ కార్యకలాపాలపై నిషేధం ఎత్తివేయనున్నట్లు అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. నేషనల్ ఎమర్జెన్సీ, క్రైసిస్ అండ్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ, జనరల్ సివిల్ ఏవియేషన్ అథారిటీ సహకారంతో అబుదాబి పోలీస్ కాలేజీలో జరిగిన ఓ కార్యక్రమంలో ఈ మేరకు ప్రకటించారు.అయితే, డ్రోన్ కార్యకలాపాల కోసం ఒక వేదికను ప్రారంభించనున్నట్లు తెలిపింది.ప్లాట్‌ఫారమ్ మొదటి దశలో కేవలం సేవలు అందించే కంపెనీలు, ప్రభుత్వ ఏజెన్సీలకు మాత్రమే పరిమితం చేయబడుతుందని జనరల్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ సెక్యూరిటీ సపోర్ట్‌లోని ఎయిర్ సపోర్ట్ డిపార్ట్‌మెంట్ డైరెక్టర్ కల్నల్ జమాల్ అల్ హోసానీ చెప్పారు. రెండో దశలో వ్యక్తిగత వినియోగానికి అనుమతి ఇస్తామని తెలిపారు. 2022లో యూఏఈ డ్రోన్ల వినియోగాన్ని నిషేధించింది.
తాజా వార్తలు
- భక్తులకు గుడ్ న్యూస్..2 గంటల్లోనే శ్రీవారి దర్శనం!
- కొనకళ్ల నారాయణ అధ్యక్ష తన ఏపీఎస్ఆర్టీసీ పాలకమండలి సమావేశం
- మహిళల వన్డే ప్రపంచ కప్ 2025ను గెలిచిన జట్టును అభినందించిన ప్రధాని మోదీ..
- ఉమ్మడి ఆర్థిక సహకారానికి ఒమన్, స్పెయిన్ పిలుపు..!!
- అమెరికా అంతర్గత కార్యదర్శితో అల్ఖోరాయెఫ్ చర్చలు..!!
- దుబాయ్ లో అమల్లోకి కొత్త టాక్సీ ఛార్జీలు.. ఫుల్ డిటైల్స్..!!
- కువైట్ లో 146 వాణిజ్య సంస్థలకు షట్ డౌన్ వార్న్స్..!!
- ఖతార్ లో అస్వాక్ వింటర్ ఫెస్టివల్ ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో కేరళ ప్రిన్సిపల్ సెక్రటరీ.. మినీ మ్యాథ్ ఒలింపియాడ్..!!
- బిగ్ అలర్ట్..మీ పాన్-ఆధార్ లింక్ చేయండి..







