స్వీట్స్ తింటున్నారా...ఈ సమస్యలని కోరి తెచ్చుకున్నట్లే

- November 25, 2024 , by Maagulf
స్వీట్స్ తింటున్నారా...ఈ సమస్యలని కోరి తెచ్చుకున్నట్లే

మనలో చాలామందికి స్వీట్స్ తినడం అంటే చాలా ఇష్టం. స్వీట్స్, బేకరీ ఫుడ్స్, పంచదారతో తయారైన స్వీట్స్ ఇలా ఏవి తేడా లేకుండా తినడానికి ఇష్టపడతారు. భోజనం తర్వాత వారికి స్వీట్స్ తినాలనే కోరిక పెరుగుతుంది. అయితే, స్వీట్స్ మాత్రమే కాదు.. మనం హెల్దీ అని తినే కొన్ని ఫుడ్స్ కూడా స్వీట్స్ తినడం వల్ల కలిగే నష్టాలనే తీసుకొస్తుంది. సాస్, పీనట్ బటర్ వంటివి. ఇవి మనకి హెల్దీగా అనిపించినప్పటకీ వాటి తయారీలో ఎక్కువగా పంచదారని వాడతారు. ఇవే కాకుండా కూల్ డ్రింక్స్, క్యాండీస్, బేకరీ ఫుడ్స్, బ్రెడ్స్, ప్రోటీన్ బార్స్ ఇలా చాలా ఫుడ్స్‌లో పంచదార కలుస్తుంది దీంతో మనకి తెలియకుండా తినే ఈ ఫుడ్స్‌తో కూడా చాలా సమస్యలు వస్తాయి. అసలు పంచదార ఎక్కువగా ఉన్న ఫుడ్స్ తినడం శారీరక, మానసిక సమస్యలు వస్తాయి. అవేంటో తెలుసుకోండి.

స్వీట్స్ తినడం వల్ల కేలరీలు పెరుగుతాయి. పోషకాలు తగ్గుతాయి. షుగర్ ప్రోడక్ట్స్‌లో ముఖ్యంగా స్వీట్స్ తిన్నప్పుడు కడుపు నిండుగా అనిపించదు. బ్లడ్ షుగర్ స్పైక్స్, వాటి నుండి క్రాష్‌లు మీకు ఆకలిని పెంచుతాయి. దీంతో ఎక్కువగా తింటారు. ఎక్కువగా తినడం వల్ల బరువు పెరుగుతారు.

స్వీట్స్ ఎక్కువగా తినడం వల్ల ముందుగా దంత సమస్యలు వస్తాయి. మన నోటిలో కొన్ని ఆరోగ్యకరమైన, నష్టం కలిగించే బ్యాక్టీరియ ఉంటుంది. మనం పంచదార తీసుకున్నప్పుడు హానికరమైన బ్యాక్టీరియాకి పంచదార అతుక్కుంటుంది. దీంతో మన నోటిలో పాచి ఏర్పడుతుంది. ఈ బ్యాక్టీరియా కొన్ని యాసిడ్స్‌ని ఏర్పరిచి ఎనామిల్, దంతాలని కవర్ చేస్తుంది. దీంతో దంత సమస్యలు వస్తాయి. పళ్ళు పుచ్చిపోవడం, విరిగిపోవడం, ఇతర దంత సమస్యలొస్తాయి.

మనం స్వీట్స్ ఎక్కువగా తినడం వల్ల బ్రెయిన్ పనితీరు తగ్గుతుంది. అల్జీమర్స్, డిమెన్షియా వంటి సమస్యలు వస్తాయి. అధ్యాయనాల ప్రకారం సంతృప్త కొవ్వు, చక్కెర ఎక్కువగా తినడం వల్ల వయసుతో సంబంధం లేకుండా జ్ఞాపకశక్తి తగ్గడం, బ్రెయిన్ షార్ప్‌గా పనిచేయకపోవడం లాంటివి జరుగుతాయి. అంతేకాకుండా కొన్ని ప్రతిస్పందనలు కూడా నియంత్రించబడతాయి.

 మనం ఎక్కువగా షుగర్ ఫుడ్స్ తీసుకోవడం వల్ల కొల్లాజెన్ రిపేర్‌కి నష్టం జరుగుతుంది. కొల్లాజెన్ అనేది చర్మాన్ని అందంగా కనిపించేలా చేసే ప్రోటీన్, కొల్లాజెన్ లేకపోవడం వల్ల చర్మం పలుచగా మారి ముసలివారిలా కనిపించేలా చేస్తుంది. దీంతో ముడతలు కూడా ఏర్పడతాయి. ఇన్ని సమస్యల్ని తీసుకొచ్చే స్వీట్స్ తినే బదులు మీరు మీ స్వీట్ క్రేవింగ్స్‌ని కంట్రోల్ చేసుకునేందుకు పండ్లని తినడం మంచిది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి చాలా మంచివి. అందాన్ని కూడా పెంచుతాయి.

 
 
Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com