బహ్రెయిన్ లో ప్రభుత్వ సేవల సమయాలు పొడిగింపు..!!

- November 26, 2024 , by Maagulf
బహ్రెయిన్ లో ప్రభుత్వ సేవల సమయాలు పొడిగింపు..!!

మనామా: ఇకపై ప్రభుత్వ మంత్రిత్వ శాఖలలో ఉదయం, సాయంత్రం షిఫ్టులు రెండింటినీ అమలు చేయాలని, ఇందుకుగాను ప్రభుత్వ సేవల సమయాలను పొడిగించాలని ఎంపీ జలాల్ కాజిమ్ ప్రతినిధుల కౌన్సిల్‌ లో ప్రతిపాదన సమర్పించారు. సేవా నాణ్యతను మెరుగుపరచడం, బహ్రెయిన్ పౌరులకు కొత్త ఉద్యోగ అవకాశాలను సృష్టించడం ఈ ప్రతిపాదన లక్ష్యం అని పేర్కొన్నారు. అనేక మంత్రిత్వ శాఖల ప్రస్తుత మార్నింగ్ మాత్రమే ఆపరేటింగ్ వేళలను పాటిస్తున్నారని, ఇది పెద్ద సంఖ్యలో ఉన్న లబ్దిదారులకు తీవ్రమైన అసౌకర్యాన్ని కలిగిస్తాయని MP కాజిమ్ వివరించారు. ఈ ప్రతిపాదనపై త్వరలోనే చర్చ జరుగుతుందని భావిస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com