500 దినార్‌లకు రెసిడెన్సీ పర్మిట్‌ల సేల్..కంపెనీ నిర్వాహకులు అరెస్ట్..!!

- November 27, 2024 , by Maagulf
500 దినార్‌లకు రెసిడెన్సీ పర్మిట్‌ల సేల్..కంపెనీ నిర్వాహకులు అరెస్ట్..!!

కువైట్: 500 దినార్‌లకు రెసిడెన్సీ పర్మిట్‌ల సేల్ చేస్తున్నకంపెనీ నెట్ వర్క్ ను అధికారులు ఛేదించారు. సాధారణ డిపార్ట్‌మెంట్ ఆఫ్ రెసిడెన్స్ అఫైర్స్ ఇన్వెస్టిగేషన్స్ ఫోర్జరీ, అధికారిక పత్రాలను తారుమారు చేయడం, డబ్బుకు బదులుగా ప్రవాసులకు రెసిడెన్సీని కల్పించడం వంటి ఆరోపణలపై ఒక కువైట్ పౌరుడు, అతని బిజినెస్ పార్టనర్ సిరియన్ జాతీయుడితో సహా కంపెనీ నిర్వాహకుల ముఠాను అరెస్టు చేసినట్టు అంతర్గత మంత్రిత్వ శాఖ వెల్లడించింది. నిందితులు దేశంలో ఉన్న కార్మికుల రెసిడెన్సీలను చట్టవిరుద్ధంగా కంపెనీకి బదిలీ చేసారని, ఒక్కో కార్మికుడికి 500 దినార్‌ల చొప్పున కార్మికులకు హెవీ ఎక్విప్‌మెంట్ డ్రైవర్ రెసిడెన్సీని పొందేందుకు, కంపెనీ తన స్పాన్సర్‌షిప్ కింద రిఫర్ చేసిందని అధికారులు తెలిపారు దాదాపు 600 మంది కార్మికులు కంపెనీ కింద నమోదు చేసుకున్నట్టు గుర్తించినట్లు తెలిపారు.  నిందితులపై  చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి వారిని సంబంధిత అధికారులకు రిఫర్ చేసినట్లు తెలిపారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com