కమలా పండ్లు తినడం వీళ్లకు చాలా డేంజర్

- November 27, 2024 , by Maagulf
కమలా పండ్లు తినడం వీళ్లకు చాలా డేంజర్

చలికాలం ప్రారంభమైంది. ఈ సీజన్‌లో కమలా పండ్లు ఎక్కువగా దొరకుతాయి.రోడ్ల పై కుప్పలు కుప్పలుగా పోసి అమ్ముతారు.తినడానికి నోటికి రుచిగా, పుల్లగా. తియ్యగా ఉంటాయి ఈ పండ్లు. ఇంట్లో చిన్న,పెద్దా తేడా లేకుండా కమలా పండ్లను బాగా ఇష్టంగా తింటార. కమలా పండ్లతో జ్యూస్ చేసుకుని కూడా తాగుతారు.ఈ సీజన్‌లో దొరికే కమలా పండ్లతో బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. కమలా పండులో ఎన్నో పోషకాలు ఉన్నాయి.దీని ధర కూడా తక్కువే కావడంతో ప్రజలు ఎక్కువగా కొని ఇంటికి తెచ్చుకుంటారు. బోలెడు ప్రయోజనాలున్నప్పటికీ కమలా పండును కొందరు తినకూడదు.దూరంగా ఉండాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

కమలా పండులో ఎన్నో పోషకాలు ఉన్నాయి. ఇది నిమ్మ, గ్రేప్ ఫ్రూట్, బత్తాయిలానే సిట్రస్ జాతికి చెందిన పండు. కమలా పండులో విటమిన్ సి, ఐరన్, మెగ్నిషియం, కాల్షియం, ఫైబర్, పొటాషియం, బి6 వంటి పోషకాలు ఎన్నో ఉన్నాయి. ఇందులో విటమిన్ సి ఎక్కువగా ఉండటం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. దీంతో అనేక వ్యాధుల నుంచి బాధపడతారు. చలికాలంలో సూర్యరశ్మి ఎక్కువగా ఉండదు. దీంతో శరీరానికి కావాల్సిన విటమిన్ డి అందదు. అదే కమలా పండు తింటే విటమిన్ అందుతుంది. ఈ పండు తినడం వల్ల రక్తపోటు అదుపులో ఉంటుంది. చెడు కొలెస్ట్రాల్‌ను అదుపు చేస్తుంది. ఇలా చెప్పుకుంటే పోతే బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు కమలా పండుతో ఉన్నాయి. అయితే, కమలా పండును కొందరు అనారోగ్య సమస్యలు ఉన్నవారు తినకూడదు. వారెవరో ఇక్కడ చుద్దాం.

ఈ సీజన్‌లో జలుబు, దగ్గు సమస్యలతో చాలా మంది బాధపడతారు. జలుబు, దగ్గు లేనివారు ఏం చక్కగా కమలా పండ్లు తినవచ్చు. అయితే, ఇప్పటికే జలుబు, దగ్గు సమస్యలతో బాధపడేవారు కమలా పండ్లు తినకూడదు. ఇలాంటి వారు కమలా పండ్లు తినడం వల్ల జలుబు తీవ్రత ఎక్కువయ్యే ప్రమాదముందని నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా పొడి దగ్గు ఉన్నవారు వీటి జోలికి పోకపోవడమే మంచిది. వీరు తింటే ఉన్న దగ్గు కాస్తా తీవ్రమైంది. ఆ తర్వాత ఊపిరాడదు. అంతేకాకుండా జలుబు, దగ్గు ఉన్నవారు కమలా పండ్లు తినడం వల్ల గొంతునొప్పి వచ్చే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.

కమలా పండ్లు ఆరోగ్యానికి ఎంతో మంచిది. అయితే, వీటిని నియంత్రణగా తీసుకోవాలి. ఈ సీజన్‌లో దొరికినాయి కదా ఎక్కువ తినకూడదు అంటున్నారు. కమలా పండ్లలో అధిక ఫైబర్ ఉంటుంది. అందుకే జీర్ణ సమస్యలు ఉన్నవారు కమలా పండ్లను తినకూడదు. ఎక్కువ తింటే జీర్ణశక్తి ప్రభావితం అయ్యే ప్రమాదముంది. దీంతో పొత్తి కడుపు తిమ్మరి, ఉబ్బరం, కడుపు నొప్పి, అతిసారానికి దారి తీయవచ్చు. ఈ పండు ఎక్కువగా తిన్నా వికారం, వాంతులు వచ్చే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. అందుకే జీర్ణ సమస్యలు ఉన్నవారు కమలా పండ్లు తినకూడదు.

కొందరు అలర్జీ, శ్వాసకోస వ్యాధులతో బాధపడతారు. అలాంటి వారు కమలా పండ్ల వినియోగం తగ్గించుకోవాలి. ఈ పండ్లను ఎక్కువ తినడం వల్ల ఇలాంటి వారికి అలర్జీ సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. చర్మంపై ఎర్రటి మచ్చలు, మంట, దద్ధుర్లు వచ్చే ప్రమాదముంది. అందుకే ఈ సమస్యలు ఉన్నవారు కమలా పండ్లను తినకపోవడమే మంచిదంటున్నారు.

ఈ రోజుల్లో చాలా మంది ఎసిడిటీ సమస్యలతో బాధపడుతున్నారు. ఇలాంటి వారు కమలా పండ్లు తినకూడదు. యాసిడ్ రిఫ్లక్స్ వ్యాధి ఉన్న వ్యక్తులు కమలాలను అధికంగా తినడం వల్ల గుండె మంట సమస్యను ఎదుర్కొంటున్నట్లు నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా గ్యాస్ కూడా ఎక్కువ అవుతుంది. అందుకే గ్యాస్ట్రిక్ సమస్యలు ఉన్నవారు కమలా పండ్లను ఎక్కువగా తినకూడదు.

కమలా పండ్లు తక్కువ మోతాదులో తింటే ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఎక్కువ తింటేనే అసలు సమస్య వస్తుంది. కమలా పండ్లు కేలరీలు ఉంటాయి. వీటిని అధికంగా తినడం వల్ల.. ఆ కేలరీలతో కలిపి అధిక బరువు పెరిగే ప్రమాదముంది. అందుకే బరువు తగ్గాలనుకునేవారు కమలా పండ్లను ఎక్కువ మోతాదులో తినకూడదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com