ఆపరేషన్ డెసర్ట్ స్టార్మ్ లో గాయపడ్డ సైనికుడు.. 10 ఏళ్ల తర్వాత మృతి..!!

- November 28, 2024 , by Maagulf
ఆపరేషన్ డెసర్ట్ స్టార్మ్ లో గాయపడ్డ సైనికుడు.. 10 ఏళ్ల తర్వాత మృతి..!!

యూఏఈ : 2015లో యెమెన్‌లో జరిగిన ఆపరేషన్ డెసిసివ్ స్టార్మ్‌లో పాల్గొని తీవ్ర గాయాలపాలైన యూఏఈ సైనికుడు మంగళవారం సాయంత్రం కన్నుమూశారు. మహ్మద్ అతిక్ సలేం బిన్ సలుమా అల్ ఖైలీ దాదాపు 10 సంవత్సరాలుగా ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌లో ఉన్నారు. సైనికుడి మరణాన్ని రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. మరణించిన వారి కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేసింది. 2015 సెప్టెంబరులో యెమెన్‌లో హౌతీ తిరుగుబాటుదారులతో పోరాడుతున్న సమయంలో మొత్తం 52 మంది యూఏఈ సైనికులు మరణించారు.  ఇదిలా ఉండగా, ప్రెసిడెన్షియల్ కోర్ట్ ఫర్ డెవలప్‌మెంట్ అండ్ ఫాలెన్ హీరోస్ అఫైర్స్ డిప్యూటీ చైర్మన్ షేక్ థెయాబ్ బిన్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ మరణించిన సైనికుడికి నివాళులర్పించారు.  అల్ ఐన్‌లోని అబూ సమ్రా ప్రాంతంలో జరిగిన సంతాప మజ్లిస్‌కు షేక్ థెయాబ్ హాజరయ్యారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com