బహ్రెయిన్ లో ట్రావెల్ బ్యాన్.. బోర్డింగ్‌కు ముందే తెలుసుకోండిలా..!!
- November 28, 2024
మనామా: బహ్రెయిన్‌లోని ప్రయాణికులు ఇప్పుడు ఇమ్మిగ్రేషన్ డెస్క్‌కి చేరుకోవడానికి ముందే ట్రావెల్ బ్యాన్ గుర్తించి తెలుసుకొని పరిష్కరించుకోవచ్చు. గతంలో ప్రయాణికులు తమ బోర్డింగ్ పాస్‌లను పొంది, ఇమ్మిగ్రేషన్‌కు చేరుకున్న తర్వాత మాత్రమే ప్రయాణ నిషేధాలను తెలుసుకునేవారు. ఈ మేరకు విమానాశ్రయంలో కొత్త విధానాలను ప్రవేశపెట్టారు. కొత్త సిస్టమ్ ప్రకారం.. ఎయిర్‌లైన్ కౌంటర్‌లలో చెక్-ఇన్ సమయంలో పాస్‌పోర్ట్ వివరాలు నేరుగా ఇమ్మిగ్రేషన్ డేటాబేస్‌కి లింక్ చేయబడుతుంది. ఇది ఏవైనా ప్రయాణ నిషేధాలు లేదా ఇతర వివరాలను వెంటనే స్క్రీన్ పై చూపెడుతుంది.
చెల్లించని జరిమానాలు లేదా బిల్లులు వంటి చిన్న సమస్యలతో ఫ్లాగ్ చేయబడిన వారికి, సమీపంలోని ఇమ్మిగ్రేషన్ కౌంటర్ లో ప్రయాణికులు తమ బకాయిలను చెల్లించవచ్చు. అనంతరం రీ చెక్ ఇన్ చేసుకొని బయలుదేరవచ్చు. పౌరులు, నివాసితులు, ప్రయాణికులు విమానాశ్రయానికి వెళ్లే ముందు వారి ప్రయాణ స్టేటస్ ను ఆన్‌లైన్‌లో చేస్ చేసుకోవాలని సూచించారు. పోర్టల్ (https://services.bahrain.bh/wps/portal/TravelBan_en) ద్వారా వివరాలను తెలుసుకోవచ్చు.
తాజా వార్తలు
- ప్రముఖ డా.చలమలశెట్టి సురేంద్రనాథ్ మృతి
- భక్తులకు గుడ్ న్యూస్..2 గంటల్లోనే శ్రీవారి దర్శనం!
- కొనకళ్ల నారాయణ అధ్యక్ష తన ఏపీఎస్ఆర్టీసీ పాలకమండలి సమావేశం
- మహిళల వన్డే ప్రపంచ కప్ 2025ను గెలిచిన జట్టును అభినందించిన ప్రధాని మోదీ..
- ఉమ్మడి ఆర్థిక సహకారానికి ఒమన్, స్పెయిన్ పిలుపు..!!
- అమెరికా అంతర్గత కార్యదర్శితో అల్ఖోరాయెఫ్ చర్చలు..!!
- దుబాయ్ లో అమల్లోకి కొత్త టాక్సీ ఛార్జీలు.. ఫుల్ డిటైల్స్..!!
- కువైట్ లో 146 వాణిజ్య సంస్థలకు షట్ డౌన్ వార్న్స్..!!
- ఖతార్ లో అస్వాక్ వింటర్ ఫెస్టివల్ ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో కేరళ ప్రిన్సిపల్ సెక్రటరీ.. మినీ మ్యాథ్ ఒలింపియాడ్..!!







