బహ్రెయిన్ లైసెన్స్ హోల్డర్లకు గుడ్ న్యూస్..ఇక విదేశాలలో సులభంగా డ్రైవింగ్..!!
- November 29, 2024
మనామా: బహ్రెయిన్‌లోని పౌరులు, నివాసితులు త్వరలో బహ్రెయిన్ డ్రైవింగ్ లైసెన్స్‌లను ఉపయోగించి యునైటెడ్ స్టేట్స్, యునైటెడ్ కింగ్డమ్, ఫ్రాన్స్, జర్మనీ, కెనడాతో సహా పలు దేశాలలో డ్రైవింగ్ చేయవచ్చు. దీనికి సంబంధించి 1949 కన్వెన్షన్‌కు బహ్రెయిన్ చేరికను చర్చించడానికి షూరా కౌన్సిల్ సిద్ధమవుతుంది. ఇది బహ్రెయిన్ డ్రైవింగ్ లైసెన్సులు ఉన్న డ్రైవర్లకు అంతర్జాతీయ డ్రైవింగ్ అనుమతిని అన్‌లాక్ చేయనుంది. ఈ నెల ప్రారంభంలో పార్లమెంటులో ఈ ప్రతిపాదనకు ఆమోదం తెలిపారు. కన్వెన్షన్‌లో చేరడం వల్ల బహ్రెయిన్ తన ట్రాఫిక్ సిస్టమ్‌లను ప్రధాన ప్రపంచ ఆర్థిక వ్యవస్థలతో చేరుతుందని, అంతర్జాతీయ డ్రైవింగ్ యాక్సెస్, భద్రతను మెరుగుపరుస్తుందని భావిస్తున్నారు. ఇప్పటికే రాజ్యాంగ అవసరాలకు అనుగుణంగా ముసాయిదాను సిద్ధం చేశారని, ఈ ఒప్పందం బహ్రెయిన్ ఇప్పటికే ఉన్న వియన్నా కన్వెన్షన్ ఆన్ రోడ్ ట్రాఫిక్ (1968)కి కట్టుబడి ఉందని హోం మంత్రిత్వ శాఖ పేర్కొంది. మొత్తంగా ఇది ఆమోదం పొందింతే.. బహ్రెయిన్ డ్రైవర్లకు గ్లోబల్ రోడ్ నెట్‌వర్క్‌లకు యాక్సెస్ లభిస్తుంది.
కన్వెన్షన్ వివరాలు
1949 కన్వెన్షన్, 35 ఆర్టికల్స్ - ఏడు అధ్యాయాలు ఉంటాయి. రహదారి భద్రత, వాహన ప్రమాణాలు, అంతర్జాతీయ డ్రైవింగ్ అనుమతుల కోసం నియమాలను వివరిస్తుంది. దేశాల సరిహద్దులలో కస్టమ్స్ ప్రోటోకాల్‌ల వంటి సాంకేతిక అవసరాలను వివరిస్తాయి.
ఇప్పటికే షురా కౌన్సిల్ కమిటీ ముసాయిదా చట్టాన్ని ఆమోదించాలని సిఫార్సు చేసింది. ఇది ప్రపంచ ట్రాఫిక్ నెట్‌వర్క్‌లలో బహ్రెయిన్‌ను చేర్చడంలో కీలకమైన దశగా పేర్కొంది. పూర్తి కౌన్సిల్ ఇప్పుడు ఈ ప్రతిపాదనపై చర్చిస్తుంది. ఇది అంతర్జాతీయ వేదికపై బహ్రెయిన్ నివాసితులు, పౌరులకు అనేక ప్రయోజనాలను అందజేస్తుందని భావిస్తున్నారు.
తాజా వార్తలు
- WPL 2026 రిటెన్షన్ లిస్ట్ ఇదే..
- టీ20 ప్రపంచకప్ ఫైనల్‌కు వేదిక ఖరారు..!
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్‌మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్‌పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!
- కువైట్ లో 28 ఏళ్ల తర్వాత కేరళ సీం విజయన్..!!
- మదీనాలో ఇద్దరు మహిళలు సహా ముగ్గురు అరెస్ట్..!!
- ఖతార్ లో సీజనల్ వెజిటేబుల్ మార్కెట్లు ప్రారంభం..!!
- ఫోన్ చార్జర్ వాడకంపై ప్రభుత్వం సూచనలు







