‘ఎయిర్‌పోర్ట్-టు-ఎయిర్‌పోర్ట్’ వీసా తిరస్కరణలు..కారణాలు ఇవేనా?

- November 29, 2024 , by Maagulf
‘ఎయిర్‌పోర్ట్-టు-ఎయిర్‌పోర్ట్’ వీసా తిరస్కరణలు..కారణాలు ఇవేనా?

యూఏఈ: ఇటీవల 'ఎయిర్‌పోర్ట్-టు-ఎయిర్‌పోర్ట్’ వీసా ఛేంజ్ కు ప్రయత్నించిన చాల మంది నిరాశే ఎదురవుతుంది. కొంతమంది వీసాలు రిజెక్ట్ కూడా అవుతున్నాయి. యూఏఈకి వచ్చేందుకు కొత్త విజిట్ వీసాల జారీ కోసం వేచి చూస్తున్నారు. సాధారణంగా  ‘ఎయిర్‌పోర్ట్-టు-ఎయిర్‌పోర్ట్’ వీసా ఛేంజ్ అనేది వీసా గడువు ముగియనున్న విజటర్స్ ఎక్కువగా ఉపయోగించే సాధారణ పద్ధతి. ఇది యూఏఈ నుండి పొరుగు దేశానికి వెళ్లి, అక్కడ విమానాశ్రయంలో తాజా వీసా కోసం దరఖాస్తు చేస్తారు. వారి విజిట్ వీసా ఆమోదం తర్వాత తిరిగి యూఏఈలోకి అడుగు పెడతారు. అయితే, ట్రావెల్ ఏజెంట్లు యూఏఈలో తమ రెసిడెన్సీను పొడిగించాలనుకునే విజటర్స్ దేశం నుండి వెళ్లకుండా పొడిగింపు పొందాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఎయిర్‌పోర్ట్-టు-ఎయిర్‌పోర్ట్ రన్ కంటే ఇది కొద్దిగా ఖరీదైనది అయినప్పటికీ, సురక్షితం అని జియోఫ్ ట్రావెల్ సీఈఓ జియోఫ్రీ సలాథన్ తెలిపారు. 'ఎయిర్‌పోర్ట్-టు-ఎయిర్‌పోర్ట్ వీసా మార్పు' రెండు నెలల వీసా కోసం Dh1,300 - Dh1,500 మధ్య ఖర్చు అవుతుందని, అదే యూఏఈలో వీసా పొడిగింపులు 30 రోజులకు సుమారు Dh1,050 ఖర్చవుతుందని పేర్కొన్నారు. 

ఇటీవల వీసా గడువు ముగియడంతో ఖలీద్ అనే భారతీయ ఇంజినీర్ వీసా మార్పు కోసం యూఏఈ నుండి జీసీసీ దేశానికి వెళ్లాడు. కానీ అతడి వీసాను అధికారులు రిజెక్ట్ చేశారు. "నేను ఇప్పటికే రెండు రౌండ్ల ఉద్యోగ ఇంటర్వ్యూలను క్లియర్ చేసాను. మూడవది నవంబర్ 25 న జరగాల్సి ఉంది. ఎయిర్ పోర్టులోనే 36గంటలపాటు వేచి ఉన్నా ఫలితం లేదు. వీసా రిజెక్ట్ అయిందని నా ట్రావెల్ ఏజెంట్‌ చెప్పాడు. నాతో పాటు ప్రయాణిస్తున్న ఇతరులకు కూడా వీసాలు తిరస్కరించబడ్డాయి. మరో మార్గం లేకపోవడంతో భారతదేశంలోని తన స్వగ్రామానికి తిరిగి రావాల్సి వచ్చింది. యూఏఈ జాతీయ దినోత్సవ సెలవుల తర్వాత ఇంటర్వ్యూ రీషెడ్యూల్ చేశారు. నేను ఉద్యోగం సంపాదించి, యూఏఈలో అడుగు పెడతానన్న నమ్మకం ఉంది.’’ వివరించాడు.  ఇటీవల తమ క్లయింట్‌ల వీసా దరఖాస్తులను రిజెక్ట్ చేస్తున్న సందర్భాలు ఉన్నాయని కొంతమంది ట్రావెల్ ఏజెంట్లు తెలిపారు.  "కొత్త వీసా రిక్వైర్మెంట్స్, వసతికి సంబంధించిన రుజువులు, నగదు అందుబాటు, రిటర్న్ టిక్కెట్‌లను చూపించాలని తప్పనిసరి చేయడం వంటి కారణాలు కూడా వీసా తిరస్కరణలకు దోహదపడుతున్నాయి." అని వైస్‌ఫాక్స్‌లోని అవుట్‌బౌండ్ ట్రావెల్ సీనియర్ కన్సల్టెంట్ శంషీద్ సివి అన్నారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com