రేసు కార్లను తుక్కుతుక్కు చేసిన కువైట్ పోలీసులు..!!
- November 29, 2024
కువైట్: ఇతరులకు హాని చేసే వాహనాలను వదిలిపెట్టబోమని, వాటిని సీజ్ చేస్తామని కువైట్ పోలీసులు హెచ్చరించారు. అదే సమయంలో చాలా మంది నిర్లక్ష్యపు డ్రైవర్లను అదుపులోకి తీసుకొని కౌన్సిలింగ్ ఇస్తున్నట్టు తెలిపారు. తాత్కాలిక ప్రధానమంత్రి, రక్షణ అంతర్గత వ్యవహారాల మంత్రి షేక్ ఫహాద్ యూసుఫ్ సౌద్ అల్-సబాహ్ ఆదేశాల మేరకు తనిఖీలు చేపడుతున్నట్టు అంతర్గత మంత్రిత్వ శాఖ వెల్లడించింది. రేసింగ్ వీడియోలు చేస్తూ వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంపై కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఇటీవల సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్న వారిపై చర్యలు తీసుకొని వారి కార్లను సీజ్ చేశామని, అనంతరం వాటిని డెమాలిష్ చేసినట్టు ప్రకటించారు. ట్రాఫిక్ చట్టాలను అమలు చేయడంలో కఠినంగా ఉంటామని, ఇతరుల ప్రాణాలకు హాని కలిగించే వ్యక్తులను వదిలిబెట్టబోమని మంత్రిత్వ శాఖ హెచ్చరించింది.
తాజా వార్తలు
- WPL 2026 రిటెన్షన్ లిస్ట్ ఇదే..
- టీ20 ప్రపంచకప్ ఫైనల్కు వేదిక ఖరారు..!
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!
- కువైట్ లో 28 ఏళ్ల తర్వాత కేరళ సీం విజయన్..!!
- మదీనాలో ఇద్దరు మహిళలు సహా ముగ్గురు అరెస్ట్..!!
- ఖతార్ లో సీజనల్ వెజిటేబుల్ మార్కెట్లు ప్రారంభం..!!
- ఫోన్ చార్జర్ వాడకంపై ప్రభుత్వం సూచనలు







