ఫ్రీ డేటా, ఫైర్ వర్క్స్: యూఏఈ జాతీయ దినోత్సవ వేడుకలపూర్తి గైడ్..!!
- November 30, 2024
యూఏఈ: యూఏఈ జాతీయ దినోత్సవ వేడుకులను పురస్కరించుకొని పట్టణాలన్ని వెలుగులతో వెలిగిపోతుంది. నాలుగు రోజులపాటు గ్రాండ్ ఈవెంట్‌లు, మిరుమిట్లుగొలిపే ప్రదర్శనలతోపాటు అనేక కార్యక్రమాలు వేచిచూస్తున్నాయి.ఇదే సమయంలో ట్రాఫిక్ ఆంక్షలతోపాటు ప్రజా రవాణాను పగడ్బందీగా నిర్వహించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. జాతీయ దినోత్సవ వేడుకలపూర్తి గైడ్ మీకొసం..
పబ్లిక్ హాలిడే డేట్స్
డిసెంబర్ 2, 3 తేదీలలో ప్రైవేట్, ప్రభుత్వ రంగాలకు సెలవులు ప్రకటించారు. చాలా కార్యాలయాలు సోమ, మంగళవారం సెలవులు ప్రకటించారు. నవంబర్ 30 నుండి డిసెంబర్ 3 వరకు దుబాయ్‌లోని జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ రెసిడెన్సీ అండ్ ఫారినర్స్ అఫైర్స్ (GDRFA)లో వీసా అమ్నెస్టీ సేవలు అందుబాటులో ఉండవు.
ఉచిత డేటా
పోస్ట్‌పెయిడ్ లేదా ప్రీపెయిడ్ కస్టమర్లకు ఉచితంగా 53GB డేటాను ‘డు’ అందిస్తుంది. పోస్ట్‌పెయిడ్ కస్టమర్‌లకు ఏడు రోజుల పాటు చెల్లుబాటు అవుతుంది. ప్రీపెయిడ్ వినియోగదారులు ఉచిత డేటాను పొందడానికి ఫ్లెక్సీ వార్షిక ప్రణాళిక కోసం సైన్ అప్ కావాలి. ఇది ఒక సంవత్సరం పాటు చెల్లుబాటు అవుతుంది.
దుబాయ్‌లో ఉచిత పార్కింగ్
డిసెంబర్ 2, 3 తేదీలలో దుబాయ్‌లో పబ్లిక్ పార్కింగ్ ప్రకటించారు. ఆదివారం కూడా ఎటువంటి ఛార్జీలు వసూలు చేయరు.
ప్రజా రవాణా టైమింగ్స్ పొడిగింపు
దుబాయ్ మెట్రో, ట్రామ్ రెండూ నవంబర్ 30 నుండి డిసెంబర్ 3 వరకు తెల్లవారుజామున 1 గంటల వరకు నడుస్తాయి.
పబ్లిక్ బీచ్ పరిమితులు
దుబాయ్‌లోని నాలుగు పబ్లిక్ బీచ్‌లు నవంబర్ 30 నుండి డిసెంబర్ 3 వరకు కుటుంబాల కోసం రిజర్వ్ చేశారు.వాటిల్లో జుమేరా బీచ్ 2, జుమేరా 3, ఉమ్ సుఖీమ్ 1, ఉమ్ సుఖీమ్ 2 కేవలం ఫ్యామిలీస్ కు మాత్రమే అనుమతి ఉంటుంది.
దుబాయ్‌లో పార్క్ వేళలు
దుబాయ్‌లోని జబీల్, అల్ సఫా, మమ్‌జార్, ముష్రిఫ్‌లలో ప్రసిద్ధమైన పార్కలు ఉదయం 8 నుండి రాత్రి 11 గంటల వరకు తెరిచి ఉంటాయి. మరికొన్ని ఉదయం 12 గంటల వరకు తెరిచి ఉంటాయి.
ఫైర్ వర్క్స్
ఎమిరేట్స్‌లో మంత్రముగ్దులను చేసే ఫైర్ వర్క్స్ ప్రదర్శనలు నిర్వహించనున్నారు.
దుబాయ్
గ్లోబల్ విలేజ్: నవంబర్ 29 నుండి డిసెంబర్ 3 రాత్రి 9గంటల వరకు
బ్లూవాటర్స్, ది బీచ్, జేబీఆర్: డిసెంబర్ 1, రాత్రి 8 గంటల వరకు
హట్టా సైన్: డిసెంబర్ 2, రాత్రి 8గంటల వరకు
దుబాయ్ ఫెస్టివల్ సిటీ మాల్: డిసెంబర్ 2, రాత్రి 9.10గంటల వరకు
అల్ సీఫ్: డిసెంబర్ 3, రాత్రి 9గంటల వరకు
దుబాయ్ పార్క్స్, రిసార్ట్స్ వద్ద రివర్‌ల్యాండ్: డిసెంబర్ 1, 2 తేదీలలో రాత్రి 7 నుంచి 9.30వరకు
అబుదాబి
యస్ బే వాటర్ ఫ్రంట్: డిసెంబర్ 2, రాత్రి 9గంగల వరకు
యాస్ మెరీనా సర్క్యూట్: డిసెంబర్ 2, రాత్రి 9గంటల వరకు (యాస్ మెరీనా సర్క్యూట్‌లో ప్రదర్శనను చూడటానికి ప్రవేశం ఉచితం. అయినప్పటికీ, ఈవెంట్ కోసం దాని అధికారిక వెబ్‌సైట్‌లో నమోదు చేసుకోవాలి.)
అల్ మరియా ద్వీపం (వాటర్ ఫ్రంట్ ప్రొమెనేడ్): డిసెంబర్ 2, 3 తేదీలలో, రాత్రి 9గంటల వరకు
షేక్ జాయెద్ ఫెస్టివల్, అల్ వత్బా: డిసెంబర్ 1-3 తేదీలలో రాత్రి సమయాల్లో
మదర్ ఆఫ్ ది నేషన్ ఫెస్టివల్, అల్ ఐన్ స్క్వేర్: డిసెంబర్ 1, 2 వ తేదీలలో రాత్రి సమయాల్లో
ఉమ్ అల్ క్వైన్
అల్ ఖోర్ వాటర్ ఫ్రంట్: డిసెంబర్ 2, రాత్రి 7గంటల వరకు (నవంబర్ 29 నుండి డిసెంబర్ 2 వరకు ఈ వేదిక వద్ద వేడుకలు జరుగుతాయి)
అధికారిక ఈద్ అల్ ఎతిహాద్ వేడుకను ఎలా చూడాలి
ఈ సంవత్సరం అల్ ఐన్‌లో అధికారికంగా వేడుకలను నిర్వహించనున్నారు.వేదిక కొంతమంది ప్రజలకు అందుబాటులో ఉండగా, సీట్లు పరిమితంగా ఉన్నాయి.ఇంట్లో నుంచి http://www.eidaletihad.ae లో ప్రత్యక్ష ప్రసారాన్ని చూడవచ్చు. ఇది డిసెంబర్ 2 సాయంత్రం 6.15 గంటలకు ప్రారంభమవుతుంది.
ఉత్సవాలను ఆస్వాదించాలనుకుంటే, అనేక ప్రాంతాల్లో పెద్ద స్క్రీన్‌లను ఏర్పాటు చేశారు.
అబుదాబి: ఖలీఫా సిటీలోని ఖలీఫా స్క్వేర్, ఎతిహాద్ అరేనా, షేక్ జాయెద్ ఫెస్టివల్, అల్ షమ్ఖా సిటీ, అల్ ఫలాహ్ సిటీ,మజలిస్ అబుదాబి.
అల్ దఫ్రా ప్రాంతం: దాల్మా వద్ద హరత్ పార్కులు, అల్ సిలాలోని షభానా పార్క్, ఘయాతిలోని జాయెద్ అల్ఖైర్ పార్క్, లివ్‌లోని వెడ్డింగ్ హాల్, అల్ మిర్ఫాలోని అల్ ముఘైరా పార్క్, అల్ ముఘైరా బే , మజలిస్ వెస్ట్రన్ రీజియన్.
అల్ ఐన్: కసర్ అల్ మువైజీ, అల్ ఐన్ ఒయాసిస్, అల్ జాహిలీ ఫోర్ట్, అల్ ఐన్ స్క్వేర్.
దుబాయ్: ఫెస్టివల్ ప్రొమెనేడ్ (దుబాయ్ ఫెస్టివల్ సిటీ), ది అవుట్‌లెట్ విలేజ్ మాల్, అల్ వార్ఫా (ఫెర్జన్ దుబాయ్), హట్టాలోని వాడి హబ్, గ్లోబల్ విలేజ్.
షార్జా: షార్జా నేషనల్ పార్క్, అల్ దైద్ ఫోర్ట్.
అజ్మాన్: మార్సా అజ్మాన్, అల్ జుర్ఫ్ ఫ్యామిలీ పార్క్.
ఉమ్ అల్ క్వైన్: అల్ ఖోర్ వాటర్ ఫ్రంట్
రస్ అల్ ఖైమా: అల్ మనార్ మాల్
ఫుజైరా: అంబ్రెల్లా బీచ్, ఫుజైరా కార్నిచ్
మ్యూజియాల్లో ఉచిత ప్రవేశం
షార్జా నగరం, కల్బా, ఖోర్ ఫక్కన్‌లోని అన్ని పబ్లిక్ మ్యూజియంలు డిసెంబర్ 1, 2 తేదీలలో ఉచిత ప్రవేశాన్ని ప్రకటించాయి.షార్జా ఈద్ అల్ ఎతిహాద్‌ను నవంబర్ 21 నుండి సాంస్కృతిక ప్రదర్శనలు, ఫైర్ వర్క్స్ వేడుకలు చూడవచ్చు.
ట్రాఫిక్ జరిమానాలపై 50% తగ్గింపు
అజ్మాన్ , ఉమ్ అల్ క్వైన్‌లలో ట్రాఫిక్ జరిమానాలపై 50% తగ్గింపును ప్రకటించారు.
కొన్ని ప్రాంతాల్లో ట్రక్కులపై నిషేధం
ట్రక్కులు, భారీ వాహనాలు డిసెంబర్ 2 , 3 తేదీలలో అబుదాబి, అల్ ఐన్ , జాయెద్ సిటీలోని ప్రధాన నగరాల్లోకి ప్రవేశించడాన్ని నిషేధించారు.
తాజా వార్తలు
- WPL 2026 రిటెన్షన్ లిస్ట్ ఇదే..
- టీ20 ప్రపంచకప్ ఫైనల్‌కు వేదిక ఖరారు..!
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్‌మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్‌పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!
- కువైట్ లో 28 ఏళ్ల తర్వాత కేరళ సీం విజయన్..!!
- మదీనాలో ఇద్దరు మహిళలు సహా ముగ్గురు అరెస్ట్..!!
- ఖతార్ లో సీజనల్ వెజిటేబుల్ మార్కెట్లు ప్రారంభం..!!
- ఫోన్ చార్జర్ వాడకంపై ప్రభుత్వం సూచనలు







