భారత్ కు చెందిన వేదాంత కాపర్ సౌదీలో $2 బిలియన్ల పెట్టుబడి

- November 30, 2024 , by Maagulf
భారత్ కు చెందిన వేదాంత కాపర్ సౌదీలో $2 బిలియన్ల పెట్టుబడి

సౌదీ అరేబియా: భారతదేశానికి చెందిన వేదాంత కాపర్ ఇంటర్నేషనల్ సంస్థ 2 బిలియన్ డాలర్ల విలువైన రాగి ప్రాజెక్టులను అభివృద్ధి చేయడానికి సౌదీ అరేబియాలోని పెట్టుబడి మంత్రిత్వ శాఖ మరియు పరిశ్రమలు మరియు ఖనిజ వనరుల మంత్రిత్వ శాఖతో ఒప్పందం కుదుర్చుకుంది. ప్రపంచ శక్తి పరివర్తనలో రాగి అత్యంత కీలకమైన ఖనిజాలలో ఒకటిగా పరిగణించబడుతున్న నేపథ్యంలో ఈ ఒప్పందం ద్వారా వేదాంత కంపెనీ సౌదీ అరేబియాలో గ్రీన్ఫీల్డ్ కాపర్ స్మెల్టర్ మరియు రిఫైనరీ విభాగంలో పెట్టుబడి పెట్టనుంది. ఈ ప్రాజెక్టులో సంవత్సరానికి 400 కిలో-టన్నుల గ్రీన్‌ఫీల్డ్ కాపర్ స్మెల్టర్ మరియు రిఫైనరీ, అలాగే రస్ అల్ ఖైర్ ఇండస్ట్రియల్ సిటీలో సంవత్సరానికి 300 కిలో-టన్నుల కాపర్ రాడ్ ప్లాంట్ (KTPA) లక్ష్యంగా పెట్టుకుంది. 


వేదాంత లిమిటెడ్‌లోని బేస్ మెటల్స్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ క్రిస్ గ్రిఫిత్ మాట్లాడుతూ సౌదీ అరేబియా యొక్క విజన్ 2030కి మద్దతుగా $1.3 ట్రిలియన్ల ఖనిజ వనరులను అన్‌లాక్ చేయడమే లక్ష్యంగా 2030 నాటికి ఖనిజాల రంగంలో GDP సహకారాన్ని $17 బిలియన్ నుండి $64 బిలియన్లకు పెంచుతామని తెలిపారు. ప్రస్తుతం రాగి యొక్క డిమాండ్ సుమారుగా 365 KTPA ఉంది, ఇది 2035 నాటికి రెట్టింపు అవుతుందని వివరించారు. మా ప్రాజెక్ట్‌లు రాగి సరఫరాలో కింగ్‌డమ్ యొక్క స్వీయ-విశ్వాసాన్ని మెరుగుపరుస్తాయి. అలాగే దశాబ్దాలుగా సౌదీ అరేబియా చమురు అన్వేషణ మరియు హైడ్రోకార్బన్‌లలో అగ్రగామిగా ఉన్నామని స్పష్టం చేశారు. 

వేదాంత కంపెనీ ఈ ప్రాజెక్టును అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించనుంది. ఈ ప్రాజెక్టు ద్వారా సౌదీ అరేబియాలోని రాగి పరిశ్రమలో కీలక పాత్ర పోషించనుంది. ఈ ప్రాజెక్టు ద్వారా సౌదీ అరేబియాలో కాపర్ ఉత్పత్తి సామర్థ్యం పెరుగుతుంది. గ్రీన్ఫీల్డ్ కాపర్ స్మెల్టర్ మరియు రిఫైనరీ ప్రాజెక్టు ద్వారా అధునాతన సాంకేతికతను ఉపయోగించి కాపర్ ఉత్పత్తి చేయబడుతుంది. సౌదీ అరేబియాలో కొత్త ఉద్యోగ అవకాశాలు సృష్టించబడతాయి. ఇంకా ఈ ప్రాజెక్టు ద్వారా ఉత్పత్తి అయ్యే రాగిని అంతర్జాతీయ మార్కెట్లో విక్రయించడం ద్వారా వేదాంత కంపెనీకి మంచి ఆదాయం లభిస్తుంది.

--వేణు పెరుమాళ్ల(మాగల్ఫ్ ప్రతినిధి)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com