డిస్నీల్యాండ్‌ను ఓడించిన అబుదాబికి చెందిన యాస్ ఐలాండ్..!!

- December 07, 2024 , by Maagulf
డిస్నీల్యాండ్‌ను ఓడించిన అబుదాబికి చెందిన యాస్ ఐలాండ్..!!

యూఏఈ: కాలిఫోర్నియాలోని డిస్నీల్యాండ్‌లోని రెండు థీమ్ పార్క్‌ల కంటే అబుదాబి యాస్ ద్వీపం గత సంవత్సరం ఎక్కువ మంది సందర్శకులను ఆకర్షించింది. ఇటీవల విడుదల చేసిన డేటా ప్రకారం.. ఇది ప్రపంచంలోనే అత్యధికంగా సందర్శించే రెండవ థీమ్ పార్క్ గా నిలించింది.  యాస్ ఐలాండ్ గత సంవత్సరం 34 మిలియన్ల మంది సందర్శకులు సందర్శించారు. ఈ మేరకు అరేబియన్ ట్రావెల్ మార్కెట్‌లో దీని ఆపరేటర్ మిరల్ ప్రకటించింది. 1955లో ప్రారంభమైన డిస్నీల్యాండ్, కాలిఫోర్నియా అడ్వెంచర్ థీమ్ పార్కులు 27.3 మిలియన్ల మంది అతిథులను స్వాగతించినట్టు థీమ్డ్ ఎంటర్‌టైన్‌మెంట్ అసోసియేషన్ (TEA) వెల్లడించింది. యాస్ ద్వీపం మొత్తం సందర్శకుల సంఖ్య మునుపటి సంవత్సరంతో పోలిస్తే 38 శాతం పెరిగిందని మిరల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ మొహమ్మద్ అల్ జాబీ తెలిపారు. 2010లో ప్రారంభమైన ఈ పార్కులో ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన రోలర్ కోస్టర్, ఫార్ములా రోస్సా, అధిక-ఆక్టేన్ రైడ్‌లను పొందేందుకు సందర్శకులు ఎక్కువగా ఆసక్తి చూపుతారని పేర్కొన్నారు. ఇక యాస్ కంటే ముందున్న ఓర్లాండో వాల్ట్ డిస్నీ వరల్డ్ కాంప్లెక్స్ నాలుగు థీమ్ పార్క్‌లు గత సంవత్సరం మొత్తం 48.8 మిలియన్ల సందర్శకులను ఆకర్షించాయి.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com