యూఏఈ-ఇండియా ట్రావెల్..విమానాలు పెరగకపోతే 'ధరలు పెరుగుతూనే ఉంటాయి'..!!

- December 07, 2024 , by Maagulf
యూఏఈ-ఇండియా ట్రావెల్..విమానాలు పెరగకపోతే \'ధరలు పెరుగుతూనే ఉంటాయి\'..!!

యూఏఈ: ఇండియా-యూఏఈ మధ్య ప్రయాణానికి విపరీతమైన డిమాండ్ ఉందని, రెండు దేశాల మధ్య నడిచే విమానాల సంఖ్యను పెంచాలని, లేదంటే విమాన ఛార్జీలు పెరుగుతూనే ఉంటాయని  ఇండియాలోని యూఏఈ  రాయబారి అబ్దుల్నాసర్ అల్షాలీ అన్నారు.  శుక్రవారం DIFCలో ప్రారంభమైన యూఏఈ-ఇండియా ఫౌండర్స్ రిట్రీట్‌లో ఆయన పాల్గొని మాట్లాడారు. రెండు దేశాల మధ్య మెరుగైన రవాణా సంబంధాలతో ద్వైపాక్షిక సంబంధాలు బలపడతాయని పేర్కొన్నారు. రెండు దేశాల మధ్య విమాన సర్వీసులను పెంచడంతోపాటు మరిన్ని టైర్ 2 భారతీయ నగరాలను యూఏఈకి అనుసంధానం చేయాలని కోరారు.  తద్వారా పర్యాటకం పెరగడంతోపాటు వ్యాపార అవకాశాలు పెరిగి కొత్గగా ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయని తెలిపారు. రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం 80 బిలియన్ డాలర్లు దాటిందన్నారు. CEPA నుండి మొత్తం మీద 15 శాతం పెరిగింది. పండ్లు, కూరగాయలతో సహా ఫార్మాస్యూటికల్, వ్యవసాయ రంగాలు 30 శాతానికి పైగా వృద్ధిని సాధించాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో 60 మంది భారతీయ స్టార్టప్‌ల వ్యవస్థాపకులు, యూఏఈ వ్యాపారవేత్తలు, ఇన్వెస్టర్లు పాల్గొన్నారు. ఢిల్లీలోని యూఏఈ రాయబార కార్యాలయం,  యూఏఈ-ఇండియా సిఇపిఎ కౌన్సిల్ (యుఐసిసి) ఈ మూడు రోజుల కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాయి.      

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com