రియాద్ మెట్రో సేవలలో అంతరాయం.. పునఃప్రారంభం..!!

- December 08, 2024 , by Maagulf
రియాద్ మెట్రో సేవలలో అంతరాయం.. పునఃప్రారంభం..!!

రియాద్: రియాద్‌లోని పబ్లిక్ ట్రాన్స్‌పోర్టేషన్ అధికారిక ఖాతా, రైళ్లలో అత్యవసర హ్యాండిల్స్‌ను ట్యాంపరింగ్ చేయడం వల్ల సర్వీస్‌కు స్వల్ప అంతరాయం ఏర్పడింది. దాంతో అలిన్మా బ్యాంక్, STC స్టేషన్‌ల మధ్య రియాద్ మెట్రో బ్లూ లైన్‌లో సేవలను తాత్కాలికంగా నిలిపివేశారు.  STC స్టేషన్ నుండి అలిన్మా బ్యాంక్ స్టేషన్‌కు షటిల్ బస్సులను ఏర్పాటు చేశారు.  ప్రతి ఒక్కరూ రియాద్ మెట్రో రైళ్లు, స్టేషన్‌లు అన్ని అనుబంధ సౌకర్యాల పట్ల సరైన శ్రద్ధ వహించాలని రాయల్ కమీషన్ ఫర్ రియాద్ సిటీ (RCRC) కోరింది. మెట్రో సేవలకు అంతరాయం కలిగించకుండా ఉండటానికి అత్యవసర హ్యాండిల్స్, ఇతర పరికరాలను తారుమారు చేయవద్దని సూచించింది. మెట్రోలో భద్రతా పరికరాలు లేదా పరికరాలను దుర్వినియోగం చేయడం చాలా తీవ్రమైన ఉల్లంఘనగా పరిగణించబడుతుందని రవాణా జనరల్ అథారిటీ తెలిపింది.  

రియాద్ మెట్రో ప్రాజెక్ట్ 85 రైలు స్టేషన్‌లు ఉన్నాయి. 34 ఎలివేటెడ్ స్టేషన్లు, 4 గ్రౌండ్స్ స్టేషన్లు, 47 స్టేషన్లు భూగర్భంలో నిర్మించారు. ఇది నగరంలో రవాణా సామర్థ్యాన్ని పెంచుతుంది. ఈ స్టేషన్‌లు పార్కింగ్ స్థలాలు, కస్టమర్ సేవలు, టిక్కెట్ అవుట్‌లెట్‌లు, దుకాణాలు మరియు రెస్టారెంట్‌ల సమూహంతో సహా సమీకృత సేవలను అందిస్తాయి. రియాద్ మెట్రో.. మధ్యప్రాచ్యంలో అతిపెద్దది. ప్రపంచంలోనే అత్యంత పొడవైన డ్రైవర్‌లేని ట్రైన్ గా గుర్తింపు పొందింది. డిసెంబర్ 20న మూడు లైన్లలో అధికారికంగా కార్యకలాపాలు ప్రారంభించింది.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com