పోలీసుల అదుపులో అల్లు అర్జున్
- December 13, 2024
హైదరాబాద్: సినీ నటుడు అల్లు అర్జున్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో చిక్కడపల్లి పోలీసులు బన్నీని అదుపులోకి తీసుకున్నారు.
డిసెంబర్ 4న పుష్ప2 ప్రీమియర్స్ షో సందర్భంగా హైదరాబాద్‌లోని ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లోని సంధ్య థియేటర్లో తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాటలో ఓ మహిళ మృతి చెందగా, ఆమె కుమారుడికి తీవ్ర గాయాలు అయ్యాయి.
మృతురాలి కుటుంబ సభ్యలు ఫిర్యాదు మేరకు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. 105, 118 (1)r/w3(5) సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో చిక్కడపల్లి పోలీసులు ఇప్పటికే ముగ్గురిని అరెస్ట్ చేశారు. తాజాగా శుక్రవారం బన్నీ నివాసానికి వెళ్లిన పోలీసులు ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
రూ.25లక్షల సాయం..
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన పై ఇప్పటికే అల్లు అర్జున్ స్పందించారు. ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. మృతురాలి కుటుంబానికి రూ.25లక్షల సాయం ప్రకటించారు. ఆమె కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్‌లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్‌ఫామ్..!!
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్‌తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!