రియాద్ లో అంతర్జాతీయ కాఫీ, చాక్లెట్ ఎక్స్‌పో ప్రారంభం..!!

- December 13, 2024 , by Maagulf
రియాద్ లో అంతర్జాతీయ కాఫీ, చాక్లెట్ ఎక్స్‌పో ప్రారంభం..!!

రియాద్: సౌదీ అరేబియాలోని రియాద్‌లో అంతర్జాతీయ కాఫీ, చాక్లెట్ ఎగ్జిబిషన్ ప్రారంభమైంది. ఇందులో 350కి పైగా స్థానిక, విదేశీ సంస్థలు పాల్గొంటున్నాయి. డిసెంబర్ 15 వరకు జరిగే ఈ ఈవెంట్‌లో కాఫీ, చాక్లెట్ పరిశ్రమలలో తాజా ఆవిష్కరణలు, పురోగతిని ప్రదర్శించేందుకు 40 దేశాల నుండి ప్రతినిధులు తరలివచ్చారు.

ఈ వార్షిక ఈవెంట్.. ప్రపంచంలోని ప్రధాన ప్రత్యేక ప్రదర్శనలలో ఒకటిగా గుర్తింపుపొందింది. ఈ సందర్భంగా చాక్లెట్ పరిశ్రమ ఎదుర్కొంటున్న సవాళ్లు-పరిష్కారాల కోసం చర్చా ప్యానెల్‌లను ఏర్పాటు చేశారు. అదే సమయంలో కాఫీ, చాక్లెట్ రంగాలలో ప్రొఫెషనల్ ట్రైనర్‌లు ప్రత్యేక శిక్షణా కోర్సులను అందిస్తున్నారు.  ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు అవకాశాలను పెంపొందించడం ఈ ఈవెంట్ లక్ష్యమని నిర్వాహకులు ప్రకటించారు. సౌదీ అరేబియా కాఫీ వినియోగంలో అగ్ర అరబ్ దేశాలలో ఒకటిగా ఉంది. ఆసియాలో పదవ స్థానంలో ఉంది. ఈ ప్రదర్శన కాఫీ-సంబంధిత వాణిజ్యం, ఆవిష్కరణలకు కేంద్రంగా సౌదీ అరేబియా స్థానాన్ని బలోపేతం చేస్తుందని భావిస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com