షార్జాలో కత్తిపోట్లతో 27 ఏళ్ల యువకుడు మృతి..!!

- December 13, 2024 , by Maagulf
షార్జాలో కత్తిపోట్లతో 27 ఏళ్ల యువకుడు మృతి..!!

యూఏఈ: షార్జాలో అల్ సియూహ్‌లో 27 ఏళ్ల ఎమిరాటీ వ్యక్తి కత్తిపోట్ల కారణంగా ప్రాణాలను కోల్పోయాడు.  పోలీసుల కథనం ప్రకారం..  ఘటనకు సంబంధించి షార్జా పోలీస్ ఆపరేషన్స్ గదికి గురువారం అర్ధరాత్రి 12.40 గంటలకు కాల్ వచ్చింది. పోలీసు పెట్రోలింగ్, క్రైమ్ సీన్ ఇన్వెస్టిగేషన్ టీమ్, నేషనల్ అంబులెన్స్ సేవలను వెంటనే ఆ ప్రదేశానికి చేరుకున్నారు. అక్కడ వారు బాధితుడు డు కత్తిపోట్లకు గురై మృత్యువుతో పోరాడుతున్నాడు.  హుటాహుటిన ఆసుపత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు.

12 గంటల్లో షార్జా పోలీస్ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ ఈ సంఘటనతో సంబంధం ఉన్న ఇద్దరు సోదరులను గుర్తించి అరెస్ట్ చేశారు. వారి మధ్య వివాదం ఉన్నట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. గొడవల కారణంగా పదునైన వస్తువుతో బాధితుడిని పొడిచినట్టు నిందితులువిచారణలో అంగీకరించారు.  తదుపరి విచారణ కోసం కేసు పబ్లిక్ ప్రాసిక్యూషన్‌కు రిఫర్ చేసినట్టు పోలీసులు తెలిపారు.వివాదాలను శాంతియుతంగా పరిష్కరించుకోవాలని, హింసకు పాల్పడకుండా ఉండాలని షార్జా పోలీసులు కోరారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com