హెరిటేజ్ విలేజ్‌లో 'సెలబ్రేట్ బహ్రెయిన్' ఫెస్టివల్ ప్రారంభం..!!
- December 13, 2024
మనామా: రాస్ హయాన్లోని హెరిటేజ్ విలేజ్‌లో సమాచార మంత్రిత్వ శాఖ నిర్వహిస్తున్న "సెలబ్రేట్ బహ్రెయిన్" ఫెస్టివల్‌ను హిస్ హైనెస్ షేక్ మొహమ్మద్ బిన్ సల్మాన్ బిన్ హమద్ అల్ ఖలీఫా ప్రారంభించారు. 1783లో అహ్మద్ అల్ ఫతేహ్ చేత ఆధునిక అరబ్, ముస్లిం రాజ్యంగా స్థాపించబడిన బహ్రెయిన్ రాజ్య జాతీయ దినోత్సవాలను పురస్కరించుకొని ఈ ఫెస్టివల్ ను నిర్వహిస్తారు. హిజ్ మెజెస్టి కింగ్ హమద్ బిన్ ఇసా అల్ ఖలీఫా సింహాసనాన్ని అధిష్టించిన వార్షికోత్సవాన్ని ఇది గుర్తుగా కూడా నిర్వహిస్తారు. జాతీయ దినోత్సవ వేడుకలు బహ్రెయిన్ ప్రజల పౌరసత్వం, జాతీయ గుర్తింపు విలువలను ప్రతిబింబిస్తాయని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా హెచ్‌హెచ్ షేక్ మొహమ్మద్ బిన్ సల్మాన్ హెచ్ఎం రాజు, హెచ్ఆర్హెచ్ ప్రిన్స్ సల్మాన్‌లకు తన అభినందనలు తెలియజేశారు. ఈ ఉత్సవంలో బహ్రెయిన్ జానపద కథలు, వారసత్వాన్ని తేలిపే ప్రదర్శనలు ఉంటాయని, ఇది బహ్రెయిన్ గొప్ప సాంస్కృతిక వారసత్వాన్ని ప్రతిబింబిస్తుందని, ఇది భవిష్యత్ తరాలకు స్ఫూర్తిని అందిస్తుందన్నారు.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్‌తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్‌ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి