ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంకు తెలంగాణ గ్రామీణ బ్యాంకు లో విలీనం

- December 14, 2024 , by Maagulf
ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంకు తెలంగాణ గ్రామీణ బ్యాంకు లో విలీనం

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో కార్యకలాపాలు సాగిస్తున్న ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంకు (APGVB) 2025 జనవరి 1 నుండి తెలంగాణ గ్రామీణ బ్యాంకులో (TGB) విలీనం అవుతున్నది. ఈ మార్పు కేవలం తెలంగాణ వరకు మాత్రమే అమలులో ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ లో యధావిధిగా ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంకు APGVB పేరు తోనే కొనసాగుతుంది. ఇక మీదట ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంకు (APGVB) తెలంగాణ రాష్ట్రంలోని అన్ని శాఖలు, హైదరాబాద్ ప్రధాన కార్యాలయంగా ఉన్న తెలంగాణ గ్రామీణ బ్యాంకు (TGB)లో విలీనం అవుతున్నాయి. 

ఇందుకు సంంధించి భారత ప్రభుత్వ ఆర్థిక సేవల విభాగం వారి ఉత్తర్వుల ప్రకారం F.No.15/15/2015(E) తేదీ: 01-01-2025 నుండి ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంకు (APGVB) యొక్క తెలంగాణ రాష్ట్రం లోని శాఖలు, హైదరాబాద్ ప్రధాన కార్యాలయంగా ఉన్న తెలంగాణ గ్రామీణ బ్యాంకు (TGB)లో విలీనం అవుచున్నవి.

ఈ విలీన ప్రక్రియ సులభంగా సాగేందుకు 2024 డిసెంబర్ 28 నుండి 2024 డిసెంబర్ 31 వరకు శాఖా కార్యకలాపాలు, ఆన్‌లైన్ బ్యాంకింగ్ సేవలు UPI, ATM, మొబైల్ బ్యాంకింగ్, ఇంటర్నెట్ బ్యాంకింగ్ మరియు ఖాతాదారుల సేవా కేంద్రాలు (CSP) పని చేయవు. తిరిగి 2025 జనవరి 1 నుండి బ్యాంకింగ్ సేవలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అందుబాటులో ఉంటాయి. 

ఈ విలీనం వల్ల బ్యాంకింగ్ సేవలు మరింత విస్తృతం అవుతాయి. APGVB శాఖలు ఇప్పుడు TGB నెట్‌వర్క్‌లో భాగమవుతాయి, తద్వారా గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు మరింత సౌకర్యవంతమైన సేవలు అందించబడతాయి. ఈ విలీనం ద్వారా ఖాతాదారులకు మెరుగైన సేవలు అందించడానికి అవకాశం ఉంటుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com