ప్ర‌ముఖ సినీ ద‌ర్శ‌కుడు శ్యామ్ బెనగల్ ఇకలేరు

- December 23, 2024 , by Maagulf
ప్ర‌ముఖ సినీ ద‌ర్శ‌కుడు శ్యామ్ బెనగల్ ఇకలేరు

ప్రముఖ సినీ దర్శకుడు శ్యామ్ బెనగల్ కన్నుమూశారు.దీర్ఘకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న శ్యామ్ బెనెగల్ (90) ఈరోజు సాయంత్రం తుదిశ్వాస విడిచారు. ఈ వార్తను ఆయన కుమార్తె పియా బెనెగల్ ధృవీకరించారు.

సికింద్రాబాద్‌లోని తిరుమలగిరిలో డిసెంబర్ 14వ తేదీన శ్యామ్ బెనెగ‌ల్ జన్మించారు. బెనెగల్ నిజాం కళాశాల, ఉస్మానియా విశ్వవిద్యాలయం, హైదరాబాద్ నుండి ఎకనామిక్స్ లో పట్టభద్రుడయ్యాడు.

కాపీ రైటర్‌గా తన కెరీర్‌ను ప్రారంభించిన బెనెగ‌ల్ 1962లో గుజరాతీలో తన మొదటి డాక్యుమెంటరీ చిత్రం ఘేర్ బేతా గంగా (గంగా నది వద్ద) తీశాడు. 2005లో సినిమా రంగంలో భారతదేశ అత్యున్నత పురస్కారం దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుతో సత్కరించారు. 1976లో భారత ప్రభుత్వం పద్మశ్రీతో సత్కరించింది. 1991లో కళల రంగంలో ఆయన చేసిన కృషికి పద్మ భూషణ్ లభించింది. అతని విజయవంతమైన చిత్రాలలో మంథన్, జుబైదా, సర్దారీ బేగం ఉన్నాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com