జర్మనీలో క్రిస్మస్ మార్కెట్ దాడి నిందితుడు ప్రమాదకరం.. గతంలోనే హెచ్చరించిన సౌదీ..!

- December 24, 2024 , by Maagulf
జర్మనీలో క్రిస్మస్ మార్కెట్ దాడి నిందితుడు ప్రమాదకరం.. గతంలోనే హెచ్చరించిన సౌదీ..!

రియాద్: జర్మనీలోని మాగ్డేబర్గ్‌లోని క్రిస్మస్ మార్కెట్‌లో తన కారుతో ఢీకొట్టి శుక్రవారం సాయంత్రం ఐదుగురు ప్రాణాలను బలిగొన్న ఘటనలో దాడి చేసిన తలేబ్ జవాద్ అల్-అబ్దుల్‌మోసెన్‌ను అప్పగించాలని సౌదీ అరేబియా గతంలో కోరింది. ఈ మేరకు గతంలోనే లెటర్ రాసినట్టు సౌదీ ప్రభుత్వం తెలిపింది. అబ్దుల్‌మోహ్సేన్ "ప్రమాదకరం" అని సౌదీ అధికారులు జర్మనీని చాలాసార్లు హెచ్చరించారని, రియాద్ అప్పగింత అభ్యర్థనను చేసినట్టు అధికారులు తెలిపారు. అతను ఆన్‌లైన్‌లో వివాదాలకు కేరాఫ్ గా నిలిచాడు. పలువురిని బెదిరించిన కేసుల్లో చట్టపరమైన సమస్యలను ఎదుర్కొంటున్నాడు. సౌదీ అధికారులు అబ్దుల్‌మోహ్‌సేన్‌పై పదేపదే ఆందోళనలు వ్యక్తం చేశారు. అబ్దుల్‌మోహ్సేన్ తనను తాను హింసకు గురైన వ్యక్తిగా సోషల్ మీడియాలో ప్రచారం చేసుకుంటాడు.అతను గతంలోనే ఇస్లాంను విడిచిపెట్టాడు. అతను "జర్మనీ ఇస్లామీకరణ"ను బహిరంగంగా వ్యతిరేకిస్తు సోషల్ మీడియాలో తరచూ పోస్టులు పడుతుంటాడని అధికారులు తెలిపారు. 2006లో జర్మనీకి వెళ్లిన అబ్దుల్‌మోసెన్‌కు దశాబ్దం తర్వాత శరణార్థి హోదా లభించింది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com