ఇజ్రాయిల్ దాడి నుండి తృటిలో తప్పించుకున్న WHO చీఫ్
- December 27, 2024
ఐరాస: యెమెన్‌లో ఇజ్రాయిల్ దాడుల నుండి ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) చీఫ్ తృటిలో తప్పించుకున్నారని అధికారులు తెలిపారు. యెమెన్ రాజధాని సనా, బహుళ ఓడరేవులపై హౌతీలు లక్ష్యంగా గురువారం ఇజ్రాయిల్‌పై వైమానిక దాడులు జరిపింది. అదే సమయంలో డబ్ల్యుహెచ్ఒ డైరెక్టర్ జనరల్ టెట్రోస్ అథనామ్ విమానం ఎక్కేందుకు సిద్ధమయ్యారని, రన్‌వేకు సమీపంలో జరిగిన బాంబు దాడిలో యుఎన్ విమాన సిబ్బంది ఒకరు గాయపడ్డారని అన్నారు. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ టవర్, విమానం కోసం వేచి ఉండు స్థలం (డిపార్చర్ లాంజ్), తాము ఉన్న ప్రదేశానికి కొన్ని మీటర్ల దూరంలో బాంబు పేలిందని, రన్‌వే దెబ్బతిందని టెడ్రోస్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్‌లో పేర్కొన్నారు. అయితే బాంబు దాడి నుండి తాను, తన సహచరులు తృటిలో తప్పించుకున్నామని తెలిపారు. దాడిలో మరణించినవారికి వారి కుటుంబ సభ్యులకు హృదయపూర్వక సానుభూతి ప్రకటించారు.
గాయపడిన వ్యక్తి యుఎన్ హ్యూమన్టేరియర్ ఎయిర్ సర్వీస్‌లో ఉన్నారని యుఎన్ ప్రతినిధి స్టెఫానీ ట్రెంబ్లె పేర్కొన్నారు.ఇజ్రాయిల్ దాడిలో కనీసం ముగ్గురు వ్యక్తులు మరణించగా, డజన్ల కొద్దీ గాయపడ్డారని సమాచారం.యుఎన్ బృందం సనాలో సురక్షితంగా ఉన్నారని ఆమె తెలిపారు. శుక్రవారం ఉదయం డబ్ల్యుహెచ్ఒ చీఫ్, యుఎన్ బృందం యెమెన్ నుండి వెళ్లే అంశాన్ని పరిశీలిస్తామని ట్రెంబ్లే పేర్కొన్నారు.
తాజా వార్తలు
- అంతరిక్షంలో ఏఐ డేటా కు గూగుల్ శ్రీకారం
- తెలుగు రాష్ట్రాలను అనుసరిస్తున్న న్యూయార్క్ కొత్త మేయర్..
- 'తానా ప్రపంచసాహిత్య వేదిక' ఆధ్వర్యంలో బాలల దినోత్సవం
- థియేటర్లలో తినుబండారాల ధరలు పై సుప్రీంకోర్టు ఆందోళన
- కువైట్ జ్లీబ్ అల్-షుయౌఖ్లోని 67 భవనాలకు నోటీసులు..!!
- ఇండియన్ ఎంబసీ ఓపెన్ హౌస్.. పలు ఫిర్యాదుల పరిష్కారం..!!
- సౌదీలో నాన్ ఆయిల్ గ్రోత్ లో ప్రైవేట్ రంగం కీలక పాత్ర..!!
- 4.6 తీవ్రతతో భూకంపం.. ముసాందంను తాకిన భూప్రకంపనాలు..!!
- ఖతార్‌లో FIFA U-17 ప్రపంచ కప్ 2025 ప్రారంభం..!!
- విషాదాంతం.. పోర్ట్ సుల్తాన్ కబూస్ సమీపంలో డెడ్ బాడీ లభ్యం..!!







