పబ్లిక్ రోడ్ను బ్లాక్ చేస్తే..గరిష్ఠంగా SR100000 జరిమానా..!!
- December 29, 2024
రియాద్: పబ్లిక్ ఫెసిలిటీస్ రక్షణ నిబంధనల ప్రకారం.. ఎవరైనా ఉద్దేశపూర్వకంగా పబ్లిక్ రోడ్డు లేదా వరద డ్రైనేజీ మార్గాలను దెబ్బతీయడం, బ్లాక్ చేయడం చేస్తే దెబ్బతిన్న ప్రాంతాన్ని మరమ్మతు చేయడానికి అయ్యే ఖర్చులో 75 శాతం జరిమానా (SR100000 వరకు) విధించబడుతుంది. ఈ మేరకు మునిసిపాలిటీలు, హౌసింగ్ మంత్రి మాజిద్ అల్-హోగైల్ నిబంధనలను ఆమోదించారు. అదే విధంగా డ్రైనేజీ మార్గాలను దెబ్బతీస్తే మరమ్మతులతోపాటు 10 శాతం జరిమానా(SR100000 మించకుండా) విధిస్తారు. రోడ్లపై వాహనాలను కడిగితే, SR3000 జరిమానా విధిస్తారు.
నీరు లేదా విద్యుత్ మీటర్లు, పబ్లిక్ టెలిఫోన్ పరికరాలు లేదా వాటి ఇన్స్టాలేషన్లను వాటి పనితీరుకు అంతరాయం కలిగించే లేదా నష్టం కలిగించే ఉద్దేశ్యంతో ట్యాంపర్ చేసే ఎవరికైనా SR3000 వరకు జరిమానా విధించబడుతుంది. పబ్లిక్ ఫెసిలిటీల రక్షణ చట్టం ప్రకారం.. ప్రజా సౌకర్యాలు అంతరాయం లేకుండా పనిచేస్తూనే ఉండేలా చర్యలు చేపట్టనున్నారు. పబ్లిక్ సౌకర్యాలను దెబ్బతీయడానికి వివిధ ఉద్దేశాలను వివరిస్తాయి. ఈ నిబంధనలలో పేర్కొన్న ఏవైనా ఉల్లంఘనలు పునరావృతమైతే, జరిమానా రెట్టింపు అవుతుందని అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- కువైట్లోకి 90% తగ్గిన డ్రగ్స్ స్మగ్లింగ్..!!
- ఓనర్ ఫోన్ నుండి నగదు చోరీ..డొమెస్టిక్ వర్కర్ కు జైలుశిక్ష..!!
- ఒమన్ లో డిజిటైలేజేషన్ ప్రాజెక్టులు వేగవంతం..!!
- అమెరికా అధ్యక్షుడితో అమీర్ సమావేశం..!!
- యూఏఈలో 6నెలల్లో 6 మిలియన్ల VPN యాప్స్ డౌన్లోడ్..!!
- వారంలో 14,039 మందిని బహిష్కరించిన సౌదీ..!!
- చిరంజీవితో తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్ సభ్యులు భేటీ
- సజ్జనార్ పేరుతో సైబర్ మోసాలు
- బస్సు ప్రమాదం..భారీగా తగ్గిన ప్రైవేట్ టికెట్ ధరలు
- గ్లోబల్ విలేజ్లో ఆహార నాణ్యతపై తనిఖీలు..!!







