దుబాయ్ హార్బర్ లో అగ్నిప్రమాదం.తప్పిన ప్రాణనష్టం..!!
- December 30, 2024
దుబాయ్: దుబాయ్ హార్బర్ ప్రాంతంలో బోటులో మంటలు చెలరేగాయి. కాగా, ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు తెలిపారు. ఇంధన కేంద్రం సమీపంలో ఆదివారం ఉదయం దుబాయ్ హార్బర్ ప్రాంతంలో బోటులో మంటలు చెలరేగాయి. దుబాయ్ సివిల్ డిఫెన్స్ ఈ ఘటనపై స్పందించింది. తమకు ఉదయం 11:50 గంటలకు సమాచారం అందిందని తెలిపింది. దుబాయ్ హార్బర్ ఫైర్ స్టేషన్ నుండి సివిల్ డిఫెన్స్ సిబ్బంది మూడు నిమిషాల్లో ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపు చేశారని తెలిపారు. ఒక గంటలో మంటలు అదుపులోకి వచ్చాయని పేర్కొన్నది.ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని తెలిపింది. అయితే, ప్రమాదానికి గల కారణాలను సివిల్ డిఫెన్స్ వెల్లడించలేదు.
తాజా వార్తలు
- కువైట్, ఈజిప్ట్ సంబంధాలు బలోపేతం..!!
- ఐదుగురుని రక్షించిన ఒమన్ ఎయిర్ ఫోర్స్..!!
- మెడికల్ అలెర్ట్: షింగిల్స్ వ్యాక్సిన్ తో స్ట్రోక్, డిమెన్షియా దూరం..!!
- 21వ ప్రాంతీయ భద్రతా సమ్మిట్ 'మనామా డైలాగ్ 2025' ప్రారంభం..!!
- సౌదీలో 60.9 మిలియన్ల పర్యాటకులు..ఖర్చు SR161 బిలియన్లు..!!
- ‘ప్రపంచ ఉత్తమ విమానయాన సంస్థగా ఖతార్ ఎయిర్వేస్..!!
- ఏపీ: తొక్కిసలాటలో 10 మందికి పైగా దుర్మరణం
- అర్థరాత్రి ఆమెజాన్ ఉద్యోగులకు లేఆఫ్ మెసేజ్ షాక్
- వాహనదారులకు బిగ్ అలర్ట్..
- మైనారిటీలకు ఉచితంగా టెట్ కోచింగ్: మంత్రి ఫరూక్







