తిరుపతి తొక్కిసలాటలో మృతుల కుటుంబాలకు నష్టపరిహారం ప్రకటించిన ప్రభుత్వం

- January 09, 2025 , by Maagulf
తిరుపతి తొక్కిసలాటలో మృతుల కుటుంబాలకు నష్టపరిహారం ప్రకటించిన ప్రభుత్వం

తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార సర్వదర్శన టోకెన్ల జారీ సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో చనిపోయిన వ్యక్తుల కుటుంబాలకు ప్రభుత్వం నష్టపరిహారం ప్రకటించింది.

మృతులకు 25 లక్షల రూపాయల చొప్పున ఎక్స్రేషియా ఇస్తామని మంత్రి అనగాని సత్యప్రసాద్ ప్రకటించారు.

తిరుపతి నగరంలోని బైరాగిపట్టెడలో చోటు చేసుకున్న తొక్కిసలాటలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. మరో 48 మంది అస్వస్థతకు గురయ్యారు. గాయపడ్డవారిని రుయా, స్విమ్స్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు. మరోవైపు తొక్కిసలాట ఘటనపై కేసు నమోదు అయింది. నారాయణవనం తహశీల్దార్ ఫిర్యాదు మేరకు.. ఈస్ట్ పీఎస్లో BNS 194 సెక్షన్ కింద కేసు నమోదు అయింది.

తిరుమలలో తొక్కిసలాట ఘటనతో అలర్ట్ అయిన టిటిడి శుక్రవారం వైకుంఠ ఏకాదశికి భారీగా ఏర్పాట్లు చేస్తుంది. ఎలాంటి అపశృతి జరగకుండా చర్యలు తీసుకుంటుంది టీటీడీ. వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా.. ఏడు కొండలను అత్యద్భుతంగా తీర్చిదిద్దారు. పూలను తెచ్చి.. శ్రీవారి ఆలయంతోపాటూ..చుట్టుపక్కల ఆలయాల్ని అలంకరించారు. తిరుమలలో లైటింగ్, ఎలక్ట్రిసిటీని కూడా సరికొత్తగా మార్చారు. 

శుక్రవారం ఉదయం ముందుగా శ్రీవారి ఆలయాన్ని తెరిచిన తర్వాత ఏకాంతంగా స్వామి
వారికి పూజలు నిర్వహిస్తారు. అనంతరం ఏకాంతంగా అభిషేకం చేస్తారు. ఆ తర్వాత ఉదయం నాలుగున్నర నుంచి భక్తులకు స్వామివారి దర్శనంకు అనుమతిస్తారు. దేశంలో HMPV వ్యాధి సోకుతోంది కాబట్టి.. భక్తులు మాస్కులు ధరించి శ్రీవారి దర్శనానికి వెళ్లాలని టీటీడీ సూచించింది. టోకెన్లు ఉన్న వారిని మాత్రమే దర్శనానికి అనుమతిస్తారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com