యు.ఆర్ అడ్వాన్స్డ్ థెర్ప్యూటిక్స్ పరిశోధనశాలను సందర్శించిన వెంకయ్యనాయుడు

- January 09, 2025 , by Maagulf
యు.ఆర్ అడ్వాన్స్డ్ థెర్ప్యూటిక్స్ పరిశోధనశాలను సందర్శించిన వెంకయ్యనాయుడు

హైదరాబాద్: హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలోని స్కూల్ ఆఫ్ లైఫ్ సైన్సెస్ లో ఏర్పాటు చేసిన అంకుర పరిశ్రమ యు.ఆర్ అడ్వాన్స్డ్ థెర్ప్యూటిక్స్ పరిశోధనశాలను గురువారం సందర్శించాను.శారీరిక రుగ్మతలకు మానవ మూల కణాలతో చికిత్స చేసే అధునాతన, మెరుగైన ప్రత్యామ్నాయ విధానాన్నిఈ అంకుర పరిశ్రమలో అభివృద్ధి చేస్తున్నారని తెలిసి సంతోషించాను. ఎటువంటి దుష్ప్రభావాలు ఉండని మూలకణాల ఆధారిత చికిత్స కు సంబంధించి ఈ సంస్థ పరిశోధనలో  కొన్ని విజయాలు సాధించిందని, మేధోహక్కులను పొందిందని తెలిసి సంతోషం అనిపించింది.శరీరంలో రుగ్మతలకు లోనైన వివిధ అవయవాలు,అవయవ భాగాలు పునరుజ్జీవం పొందటానికి మూల కణాలు దోహదం చేస్తాయని పరిశోధనలు ఇప్పటికే రుజువు చేయగా అటువంటి చికిత్స విధానాలను హైదరాబాదులో అభివృద్ధి చేయటం సంతోషకరమైన విషయం.తక్కువ ఖర్చులో మెరుగైన వైద్య చికిత్స అందించే ఇలాంటి పరిశోధనలు భారత్ లో మరిన్ని జరగాలని, యువతరం ఇందుకు ముందుకు రావాలని ఆకాంక్షిస్తున్నాను.యు.ఆర్ అడ్వాన్స్డ్ థెర్ప్యూటిక్స్ సీఈవో  జగన్మోహన్ రెడ్డికి అభినందనలు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com