6 నెలల నిషేధము ఎత్తివేతకు నియమనిబంధనలు

- July 09, 2015 , by Maagulf

A) లిమిటెడ్ కాంట్రాక్టులో ఉన్న వ్యక్తి 2 సం. ల కంటే తక్కువ కాలం పనిచేసి మానివేసినట్టైతే,  అతనిపై 6 నెలల నిషేధం విధించబడుతుంది.

6 నెలల నిషేధమును ఎత్తివేయవచ్చును.

6 నెలల నిషేధము ఎత్తివేతకు నియమనిబంధనలు:-

1. ఆ ఉద్యోగి తప్పనిసరిగా క్వాలిఫైడ్ అయిఉండాలి మరియు కనీస వేతనం -

  • హైస్కూల్ ఏటెస్టెడ్ సర్టిఫికేట్ గలవారికి - 5000
  • డిప్లొమా ఏటెస్టెడ్ సర్టిఫికేట్ గలవారికి   - 7000
  • ఏటెస్టెడ్ బాచులర్ మరియు ఆపై విద్యార్హత గల వారికి - 10,000

2. ఉద్యోగి, అదే యజమాని వద్ద తిరిగి చేరినట్లైతే, 6 నెలల నిషేధం అసంకల్పితంగా తొలగించబడుతుంది.

3. ఒక ఉద్యోగి కార్మిక శాఖ వారికి ఈ కింది కారణాలపై ఫిర్యాదు ఇచ్చినట్లైతే:

  • 2 నెలలు లేదా అంతాకుపైన జీతం ఆలస్యమైతే.
  • కంపెనీ మూసివేయబడితే.
  • సేవలకు అంతం లేనట్లైతే
  • సరైన కారణం లేకుండా తొలగించినట్లైతే

 

B) ఒక వ్యక్తి లిమిటెడ్ కాంటాక్టులో ఉంటూ, 2 సం. లలోపు రాజీనామా చేసినట్లైతే, లిమిటెడ్ కాంట్రాక్టును భంగపరచినందుకు తీసివేయలేనపుడు, ఆ కంపెనీవారి అభ్యర్ధన మేరకు ఆ వ్యక్తిపై 6 నెలలు లేదా 1 సం. నిషేధం విధించబడుతుంది.

C) రెండు సంవత్సరాల కంటే ఎక్కువ:-

పై రెండు రకాల కాంట్రాక్టులపై, కార్మిక శాఖ వారు 6 నెలల నిషేధం విధించరు; కానీ కాంట్రాక్టు పరిమితమైనపుడు,  లిమిటెడ్ కాంట్రాక్టును మీరినందుకు కంపెనీ వారు 1 సం. తిరిగి తొలగించలేని నిషేదం కొరకు అభ్యర్ధించవచ్చు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com