దుబాయ్ పార్కింగ్ కేంద్రాల్లో కార్ వాషింగ్, రిఫ్యూయలింగ్..!!

- January 16, 2025 , by Maagulf
దుబాయ్ పార్కింగ్ కేంద్రాల్లో కార్ వాషింగ్, రిఫ్యూయలింగ్..!!

దుబాయ్: పార్కింగ్ కేంద్రాలలో ఇంధనం నింపడం, కార్ వాషింగ్ వంటి సేవలను అందుబాటులోకి రానున్నాయి. ఈమేరకు ఎనోక్ రిటైల్ మేనేజింగ్ డైరెక్టర్ జైద్ అల్క్వైది, పార్కిన్ సీఈఓ మొహమ్మద్ అబ్దుల్లా అల్ అలీ  10వ దుబాయ్ ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్ ఫోరం సందర్భంగా భాగస్వామ్య ఒప్పందంపై సంతకం చేశారు. దీని ప్రకారం.. దుబాయ్‌లోని ఎంపిక చేసిన పార్కింగ్ ప్రదేశాలు త్వరలో కార్ వాషింగ్, మొబైల్ లేదా ప్రయాణంలో ఇంధనం నింపడం, ఇంజిన్ ఆయిల్ మార్పు, టైర్ తనిఖీలు, బ్యాటరీ తనిఖీలు, ఇతర ముఖ్యమైన వాహన నిర్వహణ సేవలతో సహా ఆటోమోటివ్ సేవలను అందిస్తాయి. పార్కిన్, ఎనోక్ రెండు కంపెనీల సంబంధిత మొబైల్ అప్లికేషన్‌లు, డిజిటల్ వాలెట్‌లను కూడా అనుసంధానం కానున్నాయి. వినియోగదారులు రెండు ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా ఆటోమోటివ్ సేవలను బుక్ చేసుకోవచ్చని పేర్కొన్నారు.ఇతర ఎమిరేట్స్ లకు తమ సేవలను విస్తరించనున్నట్లు పార్కిన్ సీఈఓ ఇంజనీర్ మొహమ్మద్ అబ్దుల్లా అల్ అలీ తెలిపారు.

పార్కిన్ మార్చి 2025 నుండి దుబాయ్ అంతటా ప్రీమియం పార్కింగ్ ఛార్జీలను అమలు చేస్తున్నట్లు ప్రకటించింది. ప్రీమియం పార్కింగ్ స్థలాలకు రుసుము ఉదయం 8 నుండి ఉదయం 10 గంటల వరకు గంటకు ..సాయంత్రం 4 నుండి రాత్రి 8 గంటల వరకు Dh6 వసూలు చేయనున్నారు. ఇతర అన్ని ఇతర పబ్లిక్ పెయిడ్ పార్కింగ్ స్థలాలకు గంటకు Dh4 గా ఉంటుంది. గంటకు Dh6 పార్కింగ్ ఫీజు మెట్రో స్టేషన్ నుండి 500 మీటర్ల లోపల ఉన్న ప్రాంతాలలో.. రద్దీ సమయాల్లో అధిక పార్కింగ్ ఉన్న ప్రాంతాలలో..అలాగే మార్కెట్లు, వాణిజ్య  కేంద్రాలలో అమలు చేయనున్నారు.   

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com