కువైట్ ఆరోగ్య మంత్రిని కలిసిన ఇండియన్ డేంటిస్ట్ బృందం..!!

- January 21, 2025 , by Maagulf
కువైట్ ఆరోగ్య మంత్రిని కలిసిన ఇండియన్ డేంటిస్ట్ బృందం..!!

కువైట్: కువైట్‌లోని ఇండియన్ డెంటిస్ట్స్ అలయన్స్ (IDAK) కార్యనిర్వాహక మండలి.. ఆరోగ్య మంత్రి, కువైట్, డా. అహ్మద్ అబ్దుల్‌వహాబ్ అల్ అవధిని కలుసుకున్నారు.  ఈ సందర్భంగా  ప్రస్తుతం కొనసాగుతున్న కార్యక్రమాలు, ఇరు దేశాల మధ్య ఉన్న సంబంధాలపై చర్చించారు. ఈ సమావేశానికి డెంటల్ అడ్మినిస్ట్రేషన్ అసిస్టెంట్ అండర్ సెక్రటరీ డా. అహ్మద్ అసద్ కూడా హాజరయ్యారు.  ఇంకా IDAK అధ్యక్షుడు డా. జార్జ్ పి. అలెక్స్, ప్రధాన కార్యదర్శి డా. జిజన్ సామ్ థామస్, వైస్ ప్రెసిడెంట్  డా. రోషిలా, మాథ్యూ, సంయుక్త కార్యదర్శి అమృత గీవర్గీస్, ప్రెసిడెంట్ ఎలెక్ట్ షాలిన్ అన్ సైమన్ పాల్గొన్నారు. డీకోడింగ్ డెంటల్ పెయిన్.. కేర్ టు క్యూర్ పేరుతో 9వ ఓరల్ హెల్త్ గైడ్‌ను విడుదల చేశారు.  ఇండియన డెంటల్ అసోసియేషన్ వ్యక్తిగత జీవితాలను మెరుగుపరచడానికి IDAK అంకితభావంతో పనిచేస్తుందని అల్ అవధి ప్రశంసించారు. ఏప్రిల్ 25న 5వ IDAK ఇంటర్నేషనల్ సైంటిఫిక్ సింపోజియం ఫెలిసిటేషన్ సెర్మనీకి హాజరయ్యేందుకు IDAK ఆహ్వానాన్ని మంత్రి అంగీకరించారు. ఈ ప్రతిష్టాత్మక ఈవెంట్ అల్ హషేమీ బాల్‌రూమ్, హోటల్ రాడిసన్ బ్లూలో నిర్వహించనున్నారు.   

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com